ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో జడేజా 7 వికెట్లతో చెలరేగాడు. 12.1 ఓవర్లలో కేవలం 42 పరుగులు మాత్రమే ఇచ్చి 7 వికెట్ల పడగొట్టిన జడ్డూ.. తన టెస్టు కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.
అయితే అతడు సాధించిన ఏడు వికెట్లలో ఐదు బౌల్డ్‌లు ఉండడం గమానార్హం. తద్వారా ఓ అరుదైన ఘనతను జడేజా తన పేరిట లిఖించుకున్నాడు. గత 50 ఏళ్లలో అనిల్ కుంబ్లే తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు బౌల్డ్‌లు చేసిన ఏకైక భారత స్పిన్నర్‌గా జడేజా నిలిచాడు.
1992లో జోహన్స్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాపై కుంబ్లే ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు బౌల్డ్‌లు చేశాడు. తాజా మ్యాచ్‌తో కుంబ్లే 31 ఏళ్ల రికార్డును జడ్డూ సమం చేశాడు. ఇక ఓవరాల్‌గా 2002 తర్వాత బౌల్డ్‌లు రూపంలో ఐదు వికెట్లు సాధించడం ఇదే తొలి సారి. చివరగా లాహోర్ వేదికగా 2002లో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ దిగ్గజం షోయబ్ అక్తర్ ఈ ఘనత సాధించాడు.
కుప్పకూలిన ఆస్ట్రేలియా
రవీంద్ర జడేజా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. జడేజాతో పాటు అశ్విన్ కూడా మూడు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఒక్క పరుగు అధిక్యంతో కలిపి భారత్ ముందు కేవలం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
చదవండి: IND vs AUS: 7 వికెట్లతో చెలరేగిన జడేజా.. కెరీర్ బెస్ట్ ఇదే!
Comments
Please login to add a commentAdd a comment