'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం' | Jamaica Sprinter Yohan Blake Hails Virat Kohli Took Blame For Everything | Sakshi
Sakshi News home page

'కోహ్లి కెప్టెన్సీ అంటే చాలా ఇష్టం'

Published Wed, Feb 10 2021 2:49 PM | Last Updated on Wed, Feb 10 2021 3:49 PM

Jamaica Sprinter Yohan Blake Hails Virat Kohli Took Blame For Everything - Sakshi

చెన్నై: జమైకా స్ర్పింటర్‌ యోహన్‌ బ్లేక్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో ఓటమి అనంతరం తమ తప్పులు, వైఫల్యాలు అంగీరిస్తున్నట్లు కోహ్లి​చెప్పడం నచ్చిందని తెలిపాడు. ఈ సందర్భంగా యోహన్‌ బ్లేక్‌ ట్విటర్‌లో కోహ్లి కెప్టెన్సీ, టీమిండియా ఆటగాళ్ల గురించి ఆసక్తికరంగా రాసుకొచ్చాడు. 'టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా సాగింది. కెప్టెన్‌గా రూట్‌ అద్భుత ప్రదర్శన చేయడమేగాక డబుల్‌ సెంచరీతో అదరగొట్టాడు. ఇక వయసులో సీనియర్‌ అయిన అండర్సన్‌ చివరిరోజు ఆటలో బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

టీమిండియా ఆటతీరు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా కోహ్లి కెప్టెన్సీ ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. జట్టు సమిష్టిగా చేసే తప్పులు, వైఫల్యాలను ఏ మొహమాటం లేకుండా అంగీకరిస్తాడు. బౌలర్లు సరైన దిశలో బౌలింగ్‌ చేయలేదని.. బ్యాట్స్‌మెన్లు నిలకడగా పరుగులు సాధించడంలో విఫలమయ్యారని ఒప్పుకోవడం కోహ్లికి మాత్రమే చెల్లింది.  టీమిండియాకు శుబ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు ఉండడం అదృష్టం. భవిష్యత్తులో వీరిద్దరికి మంచి పేరు వస్తుంది. వాస్తవానికి గిల్‌ 50 పరగులుతో టీమిండియాకు మంచి ఆరంభం లభించినా దానిని నిలబెట్టుకోలేకపోవడం దురదృష్టం, మరోవైపు పంత్‌ 91 పరుగులతో అటాకింగ్‌ గేమ్‌ ఆడడం ఎంతో ఆకట్టుకుంది. పంత్‌ లాంటి దూకుడైన ఆటగాడు టీమిండియాలో కచ్చింతగా ఉండాల్సిందే.

ఆసీస్‌ టూర్‌లో పుజారా గాయాలు తగిలినా తన పట్టును విడవకుండా టీమిండియా సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. పుజారా నుంచి మరోసారి అలాంటి ప్రదర్శన రావాలని కోరుకుంటున్నా. ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0 తో ఇంగ్లండ్‌ లీడ్‌లో ఉంది. రానున్న టెస్టుల్లో పరిస్థితులు కఠినతరం కానున్న నేపథ్యంలో టీమిండియా మరింత మెరుగ్గా రాణిస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. 
కాగా టీమిండియా, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి13వ తేదీ నుంచి చెన్నై వేదికగా జరగనుంది. ఇక యోహన్‌ బ్లేక్‌ 2011 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక 100 మీ, 200 మీటర్ల పరుగులో ఉసేన్‌ బోల్ట్‌ తర్వాత అత్యంత వేగవంతమైన పరుగుల వీరుడిగా రికార్డు సృష్టించాడు.
చదవండి: సంజయ్‌ బంగర్‌కు ఆర్‌సీబీ కీలక పదవి
ఆ బెయిల్‌ ఎలా కిందపడింది : ఇషాంత్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement