చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో బంగ్లా బెండు తీస్తున్నాడు. అతడిని ఎలా ఎదుర్కొవాలో తెలియన బంగ్లా బ్యాటర్లు తలలు పట్టుకుంటున్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఓ కీలక వికెట్‌తో పర్యాటక జట్టును కట్టడి చేశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బంగ్లా ఓపెనర్ జకీర్ హసన్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు కేవలం 7 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన బుమ్రా.. 18 పరుగులిచ్చి వికెట్ సాధించాడు.
బుమ్రా అరుదైన ఘనత..
ఇక ఈ మ్యాచ్‌లో జకీర్ హసన్‌ను ఔట్ చేసిన బుమ్రా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 2024 ఏడాదిలో అంతర్జాతీయ క్రికెట్(మూడు ఫార్మాట్లు)లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. బుమ్రా ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 14 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన బుమ్రా.. 47 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఇంతకుముందు ఈ రికార్డు హాంకాంగ్ పేసర్ ఎహ్సాన్ ఖాన్ పేరిట ఉండేది. ఎహ్సాన్ 27 మ్యాచ్‌ల్లో 46 వికెట్లు పడగొట్టాడు. తాజా మ్యాచ్‌తో ఎహ్సాన్‌ను భారత పేస్ గుర్రం అధిగమించాడు. ఈ జాబితాలో బుమ్రా, ఎహ్సాన్ తర్వాతి స్ధానాల్లో వనిందు హసరంగా(43), జోష్ హేజిల్‌వుడ్(41), తస్కిన్ అహ్మద్(36) ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా మూడో రోజు ముగిసే సమయానికి 37.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 రన్స్ చేసింది. బంగ్లా జట్టు విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు అవసరం.
చదవండి: IND vs BAN: అశ్విన్ మాస్టర్ మైండ్.. బంగ్లా బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్(వీడియో)
Comments
Please login to add a commentAdd a comment