indian express
టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 19న చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే చెన్నైకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో మునిగి తేలుతున్నాయి.
పాకిస్తాన్‌పై చారిత్రత్మక టెస్టు సిరీస్ విజయం సాధించిన బంగ్లాదేశ్.. టీమిండియాపై కూడా తొలి గెలుపును నమోదు చేయాలని పట్టుదలతో ఉంది. మరోవైపు భారత జట్టు బంగ్లాపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది.
ఈ క్రమంలో పర్యాటక జట్టు కంటే మూడు రోజుల ముందే చెపాక్‌కు చేరుకున్న రోహిత్ సేన తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. హెడ్‌కోచ్ కోచ్ గౌతం గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోంది.
కోహ్లికి చుక్కలు చూపించిన బుమ్రా..
ఇక ఈ రోజు(సోమవారం) ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ముప్పుతిప్పలు పెట్టినట్లు తెలుస్తోంది. బుమ్రాని ఎదుర్కొవడానికి కోహ్లి ఇబ్బంది పడినట్లు స్పోర్ట్‌స్టార్ తమ కథనంలో పేర్కొంది.
ఎర్ర నేల పిచ్‌పై బుమ్రా నిప్పులు చేరిగినట్లు సమాచారం. బుమ్రా ఇన్‌స్వింగర్‌లు, అవుట్‌స్వింగర్‌లతో కోహ్లికి చుక్కలు చూపించినట్లు సదరు క్రీడా వెబ్‌సైట్ రాసుకొచ్చింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఒకట్రెండు సార్లు కోహ్లిని జస్ప్రీత్ బౌల్డ్ చేసినట్లు వినికిడి.
కాగా చెపాక్‌లో పేస్‌కు అనుకూలించే విధంగా ఎర్ర నేల పిచ్‌ను తాయారు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా చెపాక్‌పై బంతి గింగిరాలు తిరుగుతుంది. కానీ బంగ్లా బ్యాటర్లు పేస్ బౌలింగ్‌కు ఎక్కువగా ఇబ్బంది పడతారు. బంగ్లా బ్యాటర్ల వీక్‌నెస్‌పై పేస్‌బౌలింగ్‌తో భారత్ దెబ్బ కొట్టాలని భావిస్తోంది.
చదవండి: 'రోహిత్ నా బౌలింగ్ ఆడలేకపోయాడు.. బుమ్రా సైతం మెచ్చుకున్నాడు'
Virat kohli was troubled by Jasprit Bumrah & net bowler Gurnoor Brar at Chepauk Training Camp.(SportStar)
- Jasprit Bumrah hit virat kohli straps & Pads
- Kohli was also troubled by Gurnoor Brar’s extra bounce on a few occasions as he took him on, off the front foot. pic.twitter.com/HiL26dMB1F— Sports With Naveen (@sportscey) September 16, 2024
Comments
Please login to add a commentAdd a comment