Photo Credit: Twitter
పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ప్రపంచ రికార్డుతో మెరిశాడు. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (66 పరుగులు) సాధించిన రూట్ టెస్టు క్రికెట్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన జాబితాలో సచిన్‌తో (200 టెస్టుల్లో 68 అర్ధశతకాలు) కలిసి రూట్ (167 టెస్టుల్లోనే) సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు.
మరో అర్ధసెంచరీ సాధిస్తే రూట్ టెస్టుల్లో అత్యధిక ఫిఫ్టీలు సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కనున్నాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలోనూ రూట్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉండగా, సచిన్ 15,921 పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతు న్నాడు. ఇప్పుడున్న ఫామ్ దృష్ట్యా రూట్‌కు సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఈతరం ఫ్యాబ్-4లో (కోహ్లి, స్మిత్, రూట్, కేన్ విలియమ్సన్) ఇద్దరు ఇప్పటికే రిటైరవ్వగా.. రూట్, స్మిత్ మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు.
టెస్టు కెప్టెన్‌గా మరో రికార్డు
దీంతో పాటు రూట్ టెస్టుల్లో మరో రికార్డు కూడా అందుకున్నాడు. టెస్టు కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రూట్ (42 ఫిఫ్టీలు) ఐదో స్థానానికి చేరుకున్నాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమి స్మిత్ (61), ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్ (54), అలెన్ బోర్డర్ (51) రెండు, మూడు స్థానాల్లో ఉండగా, పాక్ మాజీ బ్యాటర్ మిస్బా ఉల్ హక్ (43 ఫిఫ్టీలు) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక రూట్ సహా నలుగురు ఇంగ్లండ్ బ్యాటర్లు అర్ధశతకాలతో చెలరేగడంతో ఇంగ్లండ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 366 పరుగులు సాధించింది. రాబిన్‌సన్, జోఫ్రా ఆర్చర్‌లు క్రీజులో ఉన్నారు. హ్యారీ బ్రూక్ (91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా, జోర్డాన్ కాక్స్ (73), జో రూట్ (66), డాన్ లారెన్స్ (51) ఫిఫ్టీలు సాధించారు.
పాక్ బౌలర్లలో అలీ ఉస్మాన్ 5 వికెట్లు తీయగా, మొహమ్మద్ అబ్బాస్, ఖుర్రమ్, మొహమ్మద్ అలీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకముందు పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 191 పరుగులకు ఆలౌటైంది.
Joe Root 66(112) Vs Pakistan | 1st Test, 2026 - Leeds | Ball By Ball Highlights pic.twitter.com/gbkZ20BOwC
— PctMedia (@PctMediaa) August 20, 2026
Most fifties in Test cricket:
Joe Root - 68*.
Sachin Tendulkar- 68. pic.twitter.com/dScWCVxvSn— Mufaddal Vohra (@mufaddal_vohra) August 20, 2026


