కర్ణాటక బ్యాటర్ సంచలనం(PC: BCCI Domestic X)
COOCH BEHER TROPHY- Prakhar Chaturvedi: కర్ణాటక యువ బ్యాటర్ ప్రఖార్ చతుర్వేది సరికొత్త చరిత్ర సృష్టించాడు. కూచ్ బెహర్ ట్రోఫీ ఫైనల్లో అత్యధిక స్కోరు సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. అండర్-19 స్థాయిలో నిర్వహించే నాలుగు రోజుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో ఏకంగా 400కు పైగా పరుగులు సాధించి ఈ ఘనత సాధించాడు.
కూచ్ బెహర్ ట్రోఫీ 2023-24 ఫైనల్లో ముంబై- కర్ణాటక తలపడ్డాయి. కేఎస్‌సీఏ నవులే స్టేడియంలో జనవరి 12న మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కర్ణాటక తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో ముంబైని 384 పరుగులకు ఆలౌట్ చేసింది.
ఈ క్రమంలో సోమవారం నాటి ఆటలో భాగంగా 256 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బ్యాటింగ్ ఆరంభించిన కర్ణాటక ఓపెనర్ ప్రఖార్ చతుర్వేది బ్యాట్‌తో వీరవిహారం చేశాడు. ఏకంగా 46 ఫోర్లు, 3 సిక్సర్లు బాదిన అతడు.. 404 పరుగులతో అజేయంగా నిలిచాడు. ప్రఖార్ విధ్వంసకర ఇన్నింగ్స్ కారణంగా కర్ణాటక రికార్డు స్థాయిలో 890 పరుగులు చేసింది.
ఆట ముగిసే సరికి భారీ స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. దీంతో కర్ణాటక- ముంబై మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా ప్రఖార్ చతుర్వేది మొత్తంగా 638 బంతులు ఎదుర్కొని 404 పరుగులు సాధించడం విశేషం. ఈ క్రమంలో అతడిపై నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
చదవండి: BCCI: బీసీసీఐ సెలక్టర్‌పై వేటు? కారణం అదే! ప్రకటన విడుదల
𝙍𝙀𝘾𝙊𝙍𝘿 𝘼𝙇𝙀𝙍𝙏! 🚨
— BCCI Domestic (@BCCIdomestic) January 15, 2024
4⃣0⃣4⃣* runs
6⃣3⃣8⃣ balls
4⃣6⃣ fours
3⃣ sixes
Karnataka's Prakhar Chaturvedi becomes the first player to score 400 in the final of #CoochBehar Trophy with his splendid 404* knock against Mumbai.
Scorecard ▶️ https://t.co/jzFOEZCVRs@kscaofficial1 pic.twitter.com/GMLDxp4MYY
Comments
Please login to add a commentAdd a comment