ఆసియాకప్, వన్డే ప్రపంచకప్-2023 వంటి మెగా ఈవెంట్లకు ముందు టీమిండియాను గాయాల బెడద వెంటాడతోంది. ఇప్పటికే గాయాల కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ప్రస్తుతం బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రీలంక, పాకిస్తాన్‌ల వేదికగా జరగనున్న ఆసియాకప్ సమయానికి వీరు ముగ్గురూ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని అంతా భావించారు.
అయితే జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ ఆసియాకప్‌తో మళ్లీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది గానీ.. కేఎల్ రాహుల్ మాత్రం కోలుకోవడానికి మరో రెండు నుంచి మూడు నెలల సమయం పట్టవచ్చని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఒక వేళ ఇదే జరిగితే భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు కూడా రాహుల్ దూరమయ్యే ఛాన్స్ ఉంది.
కాగా కాగా ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారధ్యం వహించిన రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం లండన్‌లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో తన పునరావాసాన్ని ప్రారంభించాడు.
ఇక బుమ్రా విషయానికి వస్తే.. అతడు ప్రస్తుతం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆసియాకప్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం. అదే విధంగా అయ్యర్ కూడా ఆసియాకప్ సమయానికి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.
చదవండి: Prithvi Shaw: ఎవరితో.. ఏం మాట్లాడాలన్నా భయమే.. నాకు ఫ్రెండ్స్ లేనేలేరు! ఉన్నవాళ్లలో..
Comments
Please login to add a commentAdd a comment