ఆసియా కప్-2023కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ వేగంగా కోలుకుంటున్నాడు. ఆసియా కప్‌సమయానికి అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న రాహుల్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తాజాగా తన జిమ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను రాహుల్ షేర్ చేశాడు. అదే విధంగా రాహుల్ నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో అతడు తిరిగి ఆసియాకప్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది. కాగా కాగా ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్‌కు సారధ్యం వహించిన రాహుల్ ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. దీంతో గాయం కారణంగా టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అనంతరం లండన్‌లో రాహుల్ సర్జరీ చేసుకున్నాడు. ఆ తర్వాత బెంగళూరులోని నెషనల్ క్రికెట్ అకాడమీలో తన పునరావాసాన్ని ప్రారంభించాడు.
రాహుల్ చాలా కీలకం..
కాగా ఈ ఏడాదిలో ఆసియాకప్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా ఈవెంట్‌లు జరగనున్న నేపథ్యంలో రాహుల్ తిరిగి జట్టులోకి రావడం చాలా కీలకం. రాహుల్‌కు టాపర్డర్‌తో పాటు మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసే సత్తా ఉంది. ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్‌లలో ఆడిన అనుభవం కూడా రాహుల్‌కు ఉంది.
అధే విధంగా ప్రస్తుతం భారత జట్టుకు రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అందుబాటులో లేడు. రాహుల్‌కు కూడా వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉనందున అతడి స్ధానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంటుంది. రాహుల్ బ్యాకప్‌గా కిషన్, శాంసన్ ఉండవచ్చు.
చదవండి: Emerging Asia Cup 2023: సెమీఫైనల్లో శ్రీలంక ఓటమి.. ఫైనల్‌కు చేరిన పాకిస్తాన్
Comments
Please login to add a commentAdd a comment