ఆసియాకప్-2023లో భాగంగా సోమవారం నేపాల్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది. స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఆదివారం భారత జట్టుతో కలవనున్నట్లు తెలుస్తోంది.
నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ నిరూపించుకుని రాహుల్ శ్రీలంకకు శనివారమే పయనమైనట్లు సమాచారం. కాగా రాహల్ తొలత ఆసియాకప్‌కు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ ఫిట్‌నెస్ కారణంగా టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడని భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగర్కార్ తెలిపాడు.
అయితే ఇప్పుడు రాహుల్ పూర్తి ఫిట్‌నెస్ సాధించడంతో నేపాల్‌తో మ్యాచ్ కోసం జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఆసియాకప్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్-శ్రీలంక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరోపాయింట్ లభించింది.
వరల్డ్‌కప్‌కు భారత జట్టు ఫైనల్
ఇక వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. శనివారం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సమావేశమైన భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగర్కార్.. ఈ జట్టును ఖారారు చేసి నట్లు సమాచారం.తిలక్ వర్మ, సంజూ శాంసన్, ప్రసిద్ద్ కృష్ణకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చదవండి: #Heath Streak: లెజండరీ క్రికెటర్ కన్నుమూత.. భార్య తీవ్ర భావోద్వేగం
Comments
Please login to add a commentAdd a comment