ఆసియాకప్-2023 కోసం రోహిత్ సారథ్యంలోని భారత జట్టు తీవ్రంగా శ్రమిస్తోంది. బెంగళూరు సమీపంలోని ఆలూరులో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో టీమిండియా నెట్ ప్రాక్టీస్ చెమటోడ్చుతోంది. వరల్డ్‌కప్‌కు ముందు రిహార్సల్‌గా జరగుతున్న ఈ టోర్నీలో ఎలాగైనా విజయం సాధించి.. మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలవాలని భారత్ భావిస్తోంది. అయితే ఈ మెగా ఈవెంట్ ఆరంభానికి ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందింది.
టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ మాత్రమే కాకుండా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. అతడి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ మెగా టోర్నీ కోసం ప్రకటించిన 17 మంది సభ్యుల జట్టులో రాహుల్ కూడా ఉన్నాడు. అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో ఒకట్రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉందని జట్టు ప్రకటన సమయంలో భారత ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సృష్టం చేశాడు.
ఈ క్రమంలో అతడు కీలకమైన పాకిస్తాన్ మ్యాచ్‌కు దూరమవుతాడని అంతా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు రాహుల్ మాత్రం నెట్‌ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గోనడుండంతో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్-నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్2 చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఆసియాకప్‌కు టీమిండియా: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ.
స్టాండ్ బై: సంజూ శాంసన్.
చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్
KL Rahul during wicketkeeping practice.❤️🔥
— Kunal Yadav (@Kunal_KLR) August 26, 2023
Hope he will ready for #INDvPAK!
Video credit : Star Sports #TeamIndia pic.twitter.com/ORRWatRiyQ
Comments
Please login to add a commentAdd a comment