అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత కేకేఆర్‌ను 84 పరుగుల స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన ఆర్సీబీ.. ఆపై లక్ష్యాన్ని 13.3 ఓవర్లలో ఛేదిందిచింది. కేకేఆర్ విధించిన 85 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆర్‌సీబీ రెండు వికెట్లు కోల్పోయి చేధించింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో దేవదూత్ పడిక్కల్, ఫించ్‌లు కలిసి మొదటి వికెట్‌కు 46 పరుగులు జోడించగా, ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి.. గురుకీరత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి(18 నాటౌట్; 17 బంతుల్లో 2 ఫోర్లు), గుర్‌కీరత్ మన్(21 నాటౌట్; 26 బంతుల్లో 4 ఫోర్లు) సమయోచితంగా ఆడి ఘన విజయంలో పాలు పంచుకున్నారు. (ఐపీఎల్‌లో సి‘రాజ్’)
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 14 ఓవర్ మూడో బంతికి కీపర్ పక్క నుంచి షాట్ ఆడాడు. అది కీపర్‌ను దాటుకుని వెళ్లగా కోహ్లి-గుర్‌కీరత్‌మన్‌లు పరుగు పూర్తి చేశారు. దాంతో ఆర్సీబీ విజయం సాధించింది. కానీ ఇక్కడ కాస్త కన్ఫ్యూజ్ అయిన కోహ్లి రెండో పరుగు కూడా పూర్తి చేశాడు. తొలి పరుగు పూర్తి చేయడంతో విజయం సాధించామని గుర్‌కీరత్ మన్ క్రీజ్‌లో ఆగిపోయే యత్నం చేసినా కోహ్లి చకచకా రెండో పరుగుకు పిలుపు ఇవ్వడంతో గుర్‌కీరత్ కూడా ఎటువంటి ఆలోచన లేకుండా నాన్‌స్టైకర్ ఎండ్‌లోకి చేరుకున్నాడు. కానీ రెండో పరుగు పూర్తి చేసిన తర్వాత కోహ్లి ముసిముసిగా నవ్వుకున్నాడు. విన్నింగ్ షాట్‌లో మొదటి పరుగుకే లక్ష్యాన్ని చేరుకున్నా రెండో పరుగు పూర్తి చేయడంతో ఫ్యాన్స్‌లో నవ్వులు పూయించింది.
ఇక్కడ కోహ్లి ఎన్ని పరుగులు చేయాలో కన్ఫ్యూజన్‌లో రెండు పరుగు తీయడంలో తప్పేమీ లేదని, ఎందుకైనా మంచిదనే సేఫ్‌గా సెకండ్ రన్ తీశాడని అభిమానులు సరిపెట్టుకున్నారు. అయితే ఈ రెండో పరుగు స్కోర్ బుక్స్‌లో రిజస్టర్ చేస్తారా అనే అనుమానం అభిమానుల్లో వచ్చింది. విజయం సాధించిన తర్వాత కూడా పరుగు తీస్తే దాన్ని కౌంట్ చేయరు. ఒకవేళ సింగిల్ కొట్టాల్సిన సమయంలో ఫోర్ కానీ, సిక్స్ కానీ కొడితేనే అది కౌంట్ అవుతుంది. గతంలో ఒకానొక సందర్భంలో విజయానికి ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ పరుగులు చేయాల్సిన తరుణంలో ఫోర్ కొడితే దాన్ని కౌంట్ చేసేవారు కాదు. విజయానికి ఎన్ని పరుగులు కావాలో అన్నే పరుగులు బ్యాట్స్‌మన్ ఖాతాలో చేరేవి. కానీ తర్వాత మళ్లీ నిబంధనను ఉపసంహరించి ఫోర్, సిక్స్‌లకు వెసులుబాటు ఇచ్చారు.
RCB needed 1, Kohli wants 2 😍 pic.twitter.com/sAtV7clXNH
— middle stump (@middlestump4) October 21, 2020
Comments
Please login to add a commentAdd a comment