photo courtesy:ipl
తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన ఆయుష్ బదోనిపై లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం పాలైంది. అయితే లక్నోకు ప్రాతినిధ్యం వహిస్తున్న బదోని ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లోనే అద్భుతమైన అర్థసెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ, లాకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ బౌలర్లను సమర్ధవంతగా ఎదుర్కొన్నాడు. బదోని 41 బంతుల్లో 54 పరుగులు చేశాడు.
అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి. కాగా 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నోను దీపక్ హుడాతో కలిసి బదోని అదుకున్నాడు. దీంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు సాధించింది. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెఎల్ రాహుల్.. బదోనిని జూనియర్ ఏబీడీ అని కొనియాడాడు. "బదోని తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా రాణించాడు.
అతడు మాకు బేబీ ఏబీడీ లాంటి వాడు. మైదానం నలుమూలల షాట్లు ఆడే సత్తా అతడికి ఉంది. అతడికి వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకున్నందుకు సంతోషంగా ఉంది. అతడు నాలుగో స్థానంలో బ్యాటింగ్‌వచ్చాడు. అప్పటికే జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ తీవ్రమైన ఒత్తిడిలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు" అని రాహుల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment