ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కన్సల్టెంట్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ వోజెస్‌ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. వోజెస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్‌లతో కలిసి పనిచేయనున్నాడు.
ఇక ఇదే విషయంపై లాంగర్ మాట్లాడుతూ.. "లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్‌లో వోజెస్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అతడు జట్టుతో చేరడం చాలా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాను. మా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది.
మేము ఇద్దరం కలిసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్,పెర్త్ స్కార్చర్స్ ఫ్రాంచైజీలకు చాలా కాలం పాటు కలిసి పనిచేశాం. అతడొక అద్బుతమైన కోచ్. హెడ్‌కోచ్‌గా సైతం విజయవంతమయ్యాడని" పేర్కొన్నాడు. కాగా వోజెస్ 2007 నుండి 2016 వరకు ఆస్ట్రేలియా తరపున ఆడాడు.
మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా వోజెస్‌కు అపారమైన అనుభవం ఉంది. అతడి నేతృత్వంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎనిమిది దేశవాళీ టైటిళ్లను సొంతం చేసుకుంది. అదే విధంగా పెర్త్ స్కార్చర్స్‌కు రెండు బిగ్‌బాష్ టైటిళ్లను అందించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్‌కే జట్లు తలపడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment