Adam Voges
-
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం..
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు కన్సల్టెంట్‌గా ఆసీస్ మాజీ క్రికెటర్ ఆడమ్ వోజెస్ను లక్నో ఫ్రాంచైజీ నియమించింది. వోజెస్ ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, అసిస్టెంట్ కోచ్ లాన్స్ క్లూసెనర్లతో కలిసి పనిచేయనున్నాడు. ఇక ఇదే విషయంపై లాంగర్ మాట్లాడుతూ.. "లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్‌లో వోజెస్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. అతడు జట్టుతో చేరడం చాలా లాభం చేకూరుతుందని ఆశిస్తున్నాను. మా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. మేము ఇద్దరం కలిసి వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్,పెర్త్ స్కార్చర్స్ ఫ్రాంచైజీలకు చాలా కాలం పాటు కలిసి పనిచేశాం. అతడొక అద్బుతమైన కోచ్. హెడ్‌కోచ్‌గా సైతం విజయవంతమయ్యాడని" పేర్కొన్నాడు. కాగా వోజెస్ 2007 నుండి 2016 వరకు ఆస్ట్రేలియా తరపున ఆడాడు. మూడు ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. కోచ్‌గా వోజెస్కు అపారమైన అనుభవం ఉంది. అతడి నేతృత్వంలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎనిమిది దేశవాళీ టైటిళ్లను సొంతం చేసుకుంది. అదే విధంగా పెర్త్ స్కార్చర్స్‌కు రెండు బిగ్‌బాష్ టైటిళ్లను అందించాడు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెపాక్ వేదికగా ఆర్సీబీ, సీఎస్కే జట్లు తలపడనున్నాయి. -
క్రికెట్‌కు ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు గుడ్ బై
మెల్బోర్న్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ వోజెస్, జేవియర్ డోహర్తీలు క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం వెల్లడించింది. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఆరంగ్రేటం చేసిన ఆడమ్ వోజెస్ తన కెరీర్లో 20 టెస్టు మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో 1,485 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు ఉన్నాయి. కనీసం 20 ఇన్నింగ్స్‌ల్లో బాట్యింగ్ చేసిన వారిలో 61.87 సగటుతో సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే 31 వన్డేలు ఆడిన వోజెస్ ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో 870 పరుగులు చేశాడు. ఏడు టీ-ట్వంట్వీ మ్యాచ్‌లు ఆడి కేవలం ఒక అర్ధసెంచరీ సాధించాడు. టెస్టు చరిత్రలో అరంగేట్రంలో సెంచరీ సాధించిన అతి పెద్ద వయస్కుడిగా ఆడమ్ వోజెస్ గుర్తింపు సాధించాడు. లెఫ్ట్ ఆర్మ్ సిన్నర్ అయిన జేవియర్ డోహర్తీ అంతర్జాతీయ క్రికెట్లోకి 2010లో అరంగ్రేటం చేశాడు. కెరీర్లో 4 టెస్టులు ఆడి కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. 60 వన్డేలు ఆడి 55 వికెట్లు, 11 ట్వంటీ-20లు ఆడి 10 వికెట్లు పడగొట్టాడు. ఆడమ్ వోజెస్ 10 సంవత్సరాలపాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు అన్ని విధాలా కృషి చేశాడని, అతను సాధించిన ఘనతలకు అభినందనలు తెలుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ జేమ్స్ సుదర్లాండ్ తెలిపాడు. జేవియర్ డోహర్తీ కూడా మంచి పోటీతత్వం ఉన్న క్రికెటర్ అని, తన శక్తి మేరకు క్రికెట్ ఆస్ట్రేలియాకు సేవలు అందించాడని సుదర్లాండ్ కొనియాడాడు. -
'నేను చాలా భయపడ్డా'
పెర్త్: క్రికెటర్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తగలడంతో తాను తొలుత ఆందోళనకు గురైనట్లు సహచర క్రికెటర్ అస్టన్ టర్నర్ పేర్కొన్నాడు. అతని హెల్మెట్‌కు కామెరెన్ స్టీవెన్సన్ వేసిన బంతి గట్టిగా తాకడంతో తాను కాసేపు నిశ్చేష్టుడిని అయిపోయానన్నాడు. అయితే వోజస్ కుప్పకూలకపోవడంతో తనలో భయం కాస్త తగ్గినట్లు టర్నర్ తెలిపాడు. 'ఆ బంతి వోజస్ హెల్మెట్ వెనుక బాగాన తగిలిన మరుక్షణమే నాకు భయమేసింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. అవతలి వైపు ఉన్న నేను అలానే ఉండిపోయా. వోజస్ మోకాళ్లను, చేతులను భూమిపై పెట్టి కాసేపు బాధను ఓర్చుకునే ప్రయత్నం చేశాడు. కాకపోతే ఫీల్డ్‌లో కుప్పకూలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందనుకున్నా. ఆ తరువాత మ్యాచ్ కు సంబంధించిన వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి అతనికి ప్రాథమిక చికిత్స చేయడంతో నేను కాస్త కుదుటపడ్డా'అని టర్నర్ తెలిపాడు. షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ లో భాగంగా గురువారం తస్మానియా జట్టుతో ఆడుతున్న సమయంలో కామ్ స్టీవెన్సన్ విసిరిన బంతి వెస్ట్రన్ ఆస్ట్రేలియా కెప్టెన్ వోజస్ తలను బలంగా తాకింది. అయితే దీంతో వోజస్ ఫీల్డ్‌లోనే విలవిల్లాడిపోయాడు.ఆ తరువాత ఫీల్డర్లు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని స్టేడియంలోకి తరలించారు. -
క్రికెటర్ తలకు బలంగా తగిలిన బంతి
పెర్త్: ఆస్ట్రేలియా క్రికెటర్ ఆడమ్ వోజస్ తలకు బంతి బలంగా తాకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో భాగంగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరపున ఆడుతున్న వోజస్ బంతిని అంచనా వేయడంలో విఫలమై గాయపడ్డాడు. గురువారం తస్మానియా జట్టుతో ఆడుతున్న సమయంలో కామ్ స్టీవెన్సన్ విసిరిన బంతి వోజస్ తలను బలంగా తాకింది. అయితే దీంతో వోజస్ ఫీల్డ్‌లోనే విలవిల్లాడిపోయాడు. ఆ తరువాత ఫీల్డర్లు వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని వోజస్ ను తరలించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు వోజస్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వోజస్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇదే తరహాలో వోజస్ గాయపడటం ఈ ఏడాదిలో రెండోసారి.గత మేనెలలో ఇంగ్లిష్ కౌంటీల్లో ఆడుతూ వోజస్ గాయపడ్డాడు. -
బంతి తగిలి కుప్పకూలిన క్రికెటర్!
లండన్: ఆస్ట్రేలియా టెస్టు బ్యాట్స్‌మెన్ ఆడమ్ వోజస్ తలకు బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంగ్లండ్‌లోని చాంపియన్‌షిప్ గేమ్ లో భాగంగా మిడిల్ సెక్స్ కు నేతృత్వం వహిస్తున్న వోజస్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. సబ్ స్టిట్యూట్ ఫీల్డర్ విసిరిన బంతిని వికెట్ కీపర్ జాన్ సింప్సన్ వదిలేయడంతో అది కాస్తా అక్కడే ఉన్న వోజస్ తలకు బలంగా తగిలింది. దీంతో వోజస్ గ్రౌండ్ లో కూలబడిపోయాడు. అతనికి ప్రాథమిక చికిత్స అందించిన గ్రౌండ్ వైద్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని తలకు స్కాన్ చేసిన అనంతరం ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు స్పష్టం చేశారు. వోజస్ గాయం పట్ల మిడిల్ సెక్స్ డైరెక్టర్ ఆంగూస్ ఫ్రాజర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో వోజస్ కు ఇలా జరగడం నిజంగా దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం వోజస్ కోలుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్నిరోజుల క్రితం శ్రీలంక ఆటగాడు కౌశల్ సిల్వ ఓ స్వదేశీ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా తలకు బాల్ తగిలి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. -
వోజెస్ ‘డబుల్ సెంచరీ’
* తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 562 ఆలౌట్ * న్యూజిలాండ్‌తో రెండో టెస్టు వెల్లింగ్టన్: ఆడమ్ వోజెస్ (364 బంతుల్లో 239; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో... న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 154.2 ఓవర్లలో 562 పరుగుల భారీస్కోరు చేసి ఆలౌటైంది. దీంతో కంగారులకు 379 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఆదివారం మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 62.3 ఓవర్లలో 4 వికెట్లకు 178 పరుగులు చేసింది. నికోలస్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. లాథమ్ (63), గప్టిల్ (45) ఫర్వాలేదనిపించినా... విలియమ్సన్ (22), మెకల్లమ్ (10) నిరాశపర్చారు. లయోన్ 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం కివీస్ ఇంకా 201 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు 463/6 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వోజెస్, సిడెల్ (49) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు ఏడో వికెట్‌కు 99 పరుగులు జోడించారు. ఈ క్రమంలో వోజెస్ 329 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సౌతీ, బౌల్ట్, బ్రాస్‌వెల్, అండర్సన్, క్రెయిగ్ తలా రెండు వికెట్లు తీశారు. -
స్మిత్, వోగ్స్ సెంచరీలు
మెల్బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 551/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(134), వోగ్స్(106) సెంచరీలు సాధించారు. టెస్టుల్లో స్మిత్ కు ఇది 13 సెంచరీ కాగా, ఈ ఏడాదిలో ఆరోది. వోగ్స్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం. 345/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో వికెట్ నష్టపోకుండా 206 పరుగులు జోడించింది. తొలిరోజు ఆటలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా(144), ఓపెనర్ జో బర్న్స్(128) సెంచరీలు సాధించారు. నలుగుర బ్యాట్స్ మెన్లు సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
వోజెస్ 'అద్భుత' డబుల్ సెంచరీ
హోబార్ట్:మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇక్కడ వెస్టిండీస్ జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఆడమ్ వోజెస్ అద్భుత డబుల్ సెంచరీ నమోదు చేశాడు. వోజెస్(269 నాటౌట్; 285 బంతుల్లో 33 ఫోర్లు) తనదైన శైలిలో విరుచుకుపడి కెరీర్ లో తొలి ద్విశతకాన్ని సాధించాడు. అతనికి జతగా షాన్ మార్ష్(182; 266 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకోవడంతో ఆసీస్ 583/4 వద్ద డిక్లేర్ చేసింది. 438/3 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆసీస్ మరోసారి పసలేని విండీస్ బౌలింగ్ ను ఓ ఆటాడుకుంది. దీంతో మరో 145 పరుగులను నమోదు చేసే క్రమంలో ఆసీస్ ఒక వికెట్ ను మాత్రమే నష్టపోయి డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన విండీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 65.0 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. విండీస్ ఆటగాళ్లలో బ్రాత్ వైట్(2), రాజేంద్ర చంద్రిక(25), మార్లోన్ శామ్యూల్స్(9), బ్లాక్ వుడ్(0), రామ్ దిన్(8), కెప్టెన్ హోల్డర్ (15)లు నిరాశపరచగా, డ్వేన్ బ్రేవో(94 బ్యాటింగ్), రోచ్(31 బ్యాటింగ్)లు ఆకట్టుకున్నారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ మూడు వికెట్లు సాధించగా, హజిల్ వుడ్ రెండు, సిడెల్ ఒక వికెట్ తీశారు. మ్యాచ్ విశేషాలు.. 250కు పైగా వ్యక్తిగత పరుగులు చేసే క్రమంలో వోజెస్ ది నాల్గో అత్యుత్తమ స్ట్రైక్ రేట్(94.38). అంతకుముందు మూడు అత్యుత్తమ స్ట్రైక్ రేట్ లు భారత్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిటే ఉండటం విశేషం. షాన్ మార్ష్-వోజెస్ లు నాల్గో వికెట్ కు 449 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఇదే ఓవరాల్ గా నాల్గో వికెట్ కు అత్యుత్తమం 449 .. ఆసీస్ గడ్డపై ఏ వికెట్ కైనా నమోదైన భాగస్వామ్యాల్లో మార్ష్-వోజెస్ ల తాజా భాగస్వామ్యమే అత్యుత్తమం. అంతకుముందు ఈ రికార్డు డాన్ బ్రాడ్ మన్-సిడ్ బార్న్స్ జోడి పేరిట ఉండేది. 1946-47లో యాషెస్ సిరీస్ లో బ్రాడ్ మన్, బార్న్స్ ల జోడి 405 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. 449.. వెస్టిండీస్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం -
బిషూ 'సిక్సర్'... వోజెస్ సెంచరీ
రోసీయూ: వెస్టిండీస్ తో జరుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 318 పరుగులు చేసింది. ఆడమ్ వోజెస్ తొలి టెస్టు సెంచరీతో ఆసీస్ కు ఆధిక్యం దక్కింది. 178 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను వోజెస్ అజేయ శతకంతో గట్టెక్కించాడు. చివరి రెండు వికెట్ కు అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. హాజిల్ వుడ్ తో కలిసి పదో వికెట్ కు 97 పరుగులు జోడించాడు. హాజిల్ వుడ్ 39 పరుగులు చేసి చివరి వికెట్ గా అవుటయ్యాడు. తొలి టెస్టు ఆడుతున్న వోజెస్ పట్టుదలగా ఆడి శతకం నమోదు చేశారు. 247 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ తో 130 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ దేవేంద్ర బిషూ (6/80) కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన విండీస్ 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.