స్మిత్, వోగ్స్ సెంచరీలు
మెల్‌బోర్న్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 551/3 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(134), వోగ్స్(106) సెంచరీలు సాధించారు. టెస్టుల్లో స్మిత్ కు ఇది 13 సెంచరీ కాగా, ఈ ఏడాదిలో ఆరోది. వోగ్స్ కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.
345/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ మరో వికెట్ నష్టపోకుండా 206 పరుగులు జోడించింది. తొలిరోజు ఆటలో వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఉస్మాన్ ఖవాజా(144), ఓపెనర్ జో బర్న్స్(128) సెంచరీలు సాధించారు. నలుగుర బ్యాట్స్ మెన్లు సెంచరీలతో చెలరేగడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.