జోహన్నెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో 106 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సమమైంది. తొలి వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20 దక్షిణాఫ్రికా, మూడో టీ20లో భారత్ గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ సంచలన త్రోతో మెరిశాడు. సిరాజ్ తన మెరుపు త్రో సౌతాఫ్రికా స్టార్ ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
ఏమి జరిగిందంటే?
ప్రోటీస్ ఇన్నింగ్స్ 4వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రెండో బంతిని హెండ్రిక్స్ మిడ్-ఆన్ దిశగా షాట్ ఆడాడు. ఈ క్రమంలో సింగిల్ కోసం హెండ్రిక్స్ నాన్-స్ట్రైకర్స్ ఎండ్ పరిగెత్తాడు. అయితే మిడ్-ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ వెంటనే బంతిని అందుకుని నాన్-స్ట్రైకర్స్ ఎండ్ వైపు డైరక్ట్ త్రో చేశాడు.
హెండ్రిక్స్ క్రీజుకు చేరిటప్పటికే బంతి స్టంప్స్‌ను గిరాటేసింది. ఇది చూసిన ప్రోటీస్ బ్యాటర్ షాక్‌కు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ మ్యాచ్‌లో సిరాజ్ వికెట్ సాధించికపోయినప్పటికీ తన బౌలింగ్‌తో అందరని అకట్టుకున్నాడు. 3 ఓవర్లు వేసిన సిరాజ్ కేవలం 13 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందులో ఒక మెయిడిన్ ఓవర్ ఉండడం విశేషం.
చదవండి: IND vs SA: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. ప్రపంచంలో ఒకే ఒక్కడు
With outswingers and direct hits, @mdsirajofficial has not missed his target today 🎯
— Star Sports (@StarSportsIndia) December 14, 2023
Tune-in to the 3rd #SAvIND T20I
LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/6UTxXnN7Fs
Comments
Please login to add a commentAdd a comment