IPL 2023: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు! | Pacer Mohsin Khan Joins Lucknow Super Giants Squad - Sakshi
Sakshi News home page

IPL 2023: లక్నో సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అతడు వచ్చేస్తున్నాడు!

Apr 17 2023 9:25 PM | Updated on Apr 18 2023 11:14 AM

Mohsin Khan joins Lucknow Super Giants squad for remainder of season - Sakshi

మొహ్సిన్ ఖాన్(ఫైల్‌ ఫోటో)

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్‌ అందింది. ఆ జట్టు స్టార్‌ పేసర్‌ మొహ్సిన్ ఖాన్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఈ క్రమంలో అతడు త్వరలోనే లక్నో జట్టులో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది సీజన్‌ ఆరంభానికి ముందు మొహ్సిన్ ఖాన్ తన భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. దీంతో ఈ మెగా టోర్నీ మొత్తానికి అతడు దూరం కానున్నట్లు వార్తలు వినిపించాయి.

కానీ ఇప్పుడు అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించిడం.. లక్నో శిబరంలో సరికొత్త జోష్‌ నింపింది. అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు లక్నో వైద్య బృందం కూడా దృవీకరించింది. ఇక ఇప్పటికే మార్క్ వుడ్, ఉనద్కత్, అవేష్ ఖాన్, నవీన్-ఉల్-హక్ వంటి అద్భుతమైన పేసర్లు ఉన్నారు.

కాగా ఐపీఎల్‌ 2022 వేలంలో మొహ్సిన్ ఖాన్‌ను కేవలం రూ.20 లక్షలకు లక్నో కొనుగోలు చేసింది. మొహ్సిన్ ఖాన్‌ గతేడాది సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడిన మొహ్సిన్ 14 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IPL 2023 GT Vs RR: షమీపై సీరియస్‌ అయిన హార్దిక్‌.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? వీడియో​వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement