ఐపీఎల్ 2024 సీజన్‌తో హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్లు మయాంక్ యాదవ్, మొహిసిన్ ఖాన్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగబోయే తదుపరి మ్యాచ్‌కు దూరం కానున్నారని తెలుస్తుంది. వీరిద్దరు గాయాల బారిన పడినట్లు సమాచారం. మయాంక్ పొత్తి కడుపు నొప్పితో.. మొహిసిన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని ఎల్‌ఎస్‌జీ వర్గాలు పేర్కొన్నాయి.
గుజరాత్‌తో మ్యాచ్ సందర్భంగా పొత్తి కడుపు నొప్పితో విలవిలలాడిన మయాంక్ మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. మయాంక్‌ను వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలుస్తుంది. గత మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితమైన మొహిసిన్.. ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా వెన్ను నొప్పి సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుత సీజన్‌లో మయాంక్ యాదవ్ సంచలన ప్రదర్శనలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే.
ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీసి రెండింట ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉండగా మయాంక్ గాయపడటం ఎల్‌ఎస్‌జీని ఇబ్బంది పెడుతుంది. మరోవైపు మొహిసిన్ సైతం ఈ సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. మొహిసిన్ ఎల్‌ఎస్‌జీ ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు.
మయాంక్, మొహిసిన్‌ల గైర్హాజరీలో లక్నో తరఫున మరో యువ పేసర్ చెలరేగిపోయాడు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో యశ్ ఠాకూర్ 3.5 ఓవర్లలో 30 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మొయిడిన్ ఉంది. ఈ ప్రదర్శన కారణంగా యశ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇదిలా ఉంటే, జట్టులో ప్రతి ఆటగాడు తలో చేయి వేస్తుండటంతో లక్నో ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓటమి మినహా లక్నో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్థాన్ చేతిలో ఓటమి అనంతరం ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. లక్నో ఏప్రిల్ 12న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లక్నో సొంత మైదానంలో జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment