
టీమిండియా మాజీ సారథి ధోని రిటైర్మెంట్‌ను పురస్కరించుకొని ప్రశంసిస్తూ లేఖ రాసిన ప్రధాని నరేంద్ర మోదీ మరో క్రికెటర్ రైనాకూ కితాబిచ్చారు. శుక్రవారం మోదీ... రైనా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆసీస్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ రైనా ఆడిన కీలక ఇన్నింగ్స్ (34 నాటౌట్) అపురూపమైందని, లక్ష్యఛేదనలో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన తీరు అద్వితీయమని మోదీ ప్రశంసించారు. భారత క్రికెట్ చిరస్మరణీయ విజయాల్లో భాగమైన ఆటగాళ్లు దేశానికి ఆదర్శమని, యువతకు స్ఫూర్తిదాయకమని కీర్తించారు. క్రికెట్‌లో, చెన్నై సూపర్‌కింగ్స్‌లో రామలక్ష్మణులుగా పేర్కొనే ధోని, రైనాలు నిమిషాల వ్యవధిలోనే వీడ్కోలు పలికారు. ధోని రిటైర్మెంట్ నిర్ణయం వెలువరించిన వెంటనే రైనా కూడా గుడ్‌బై చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment