బెంగళూరు వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. వర్షం కారణంగా తొలి ఆట రోజు పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో రెండో రోజు టాస్‌ను వేశారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
కానీ రోహిత్ తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా బెడిసి కొట్టిందనే చెప్పాలి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు కివీస్ పేసర్లు చుక్కలు చూపిస్తున్నారు. బంతిని టచ్ చేయాలంటే టీమిండియా బ్యాటర్లు భయపడుతున్నారు. బంతి అద్భుతంగా స్వింగ్ అవుతోంది.
కివీస్ పేసర్ల ధాటికి భారత టాపార్డర్ కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి టిమ్ సౌథీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కోహ్లిని విలియం ఒరోర్కే ఔట్ చేయగా, సర్ఫరాజ్‌ను మాట్ హెన్రీ బోల్తా కొట్టించాడు.
రోహిత్ తప్పు చేశాడా?
అయితే రోహిత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. గత రెండు రోజులగా పిచ్ కవర్ల కింద ఉన్నప్పుడు బ్యాటింగ్ ఎలా ఎంచుకుంటావని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఓవర్‌కాస్ట్ కాండీషన్స్ దృష్ట్యా తొలుత బౌలింగ్ చేసి ఉంటే బాగుండేది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సాధరణంగా పిచ్ కవర్ల కింద కొన్ని గంటలు గానీ ఉన్నప్పుడు వికెట్ బౌలింగ్‌కే ఎక్కువగా అనుకూలిస్తోంది. అంటే బంతి ఎక్కువగా బౌన్స్ , స్వింగ్ అవుతుంది. ఇప్పుడే ఇదే కండీషన్స్‌ను కివీస్ బౌలర్లకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. బంతిని రెండు వైపులా మూవ్ చేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు. భారత్ కేవలం 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చదవండి: IPL 2025: రిషబ్ పంత్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్?
Rohit selfless Sharma gone .#INDvNZ pic.twitter.com/bGRsWu8uYK
— Ayan (@ayan3955) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment