Ramiz Raja Proposal To ICC: దాయాదల పోరుకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా సరికొత్త ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు. ఇకపై భారత్, పాక్‌లతో సహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను కలుపుకుని ప్రతి ఏడాది ఓ టీ20 టోర్నీ నిర్వహించాలని ఐసీసీని కోరాడు. ఈ టోర్నీని రొటేషన్ పద్దతిలో ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో జరిగే విధంగా ప్లాన్ చేయాలని సూచించాడు. భారత్-పాక్, ఆసీస్-ఇంగ్లండ్ మ్యాచ్‌ల వ్యూయర్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీని నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీని ట్విటర్ వేదికగా కోరాడు.
కాగా, రమీజ్ ప్రతిపాదనపై ఐసీసీ సహా బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. ఏదిఏమైనప్పటికీ రమీజ్ ప్రతిపాదనను క్రికెట్ అభిమానులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇలాంటి టోర్నీలు జరగడం శుభపరిణామమని అంటున్నారు. ఇదే జరిగితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్ధికంగా మరింత బలపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలాకాలంగా భారత్-పాక్‌లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురెదురుపడుతున్న విషయం తెలిసిందే.
చదవండి: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు
Comments
Please login to add a commentAdd a comment