Rameez Raja
-
'110 శాతం ఫిట్‌గా ఉన్నా.. టీమిండియాతో పోరుకు సిద్ధం'
పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా వెల్లడించాడు. షాహిన్ అఫ్రిది అక్టోబర్ 23న చిరకాల ప్రత్యర్థి టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు ఎదురుచూస్తున్నాడని పేర్కొన్నాడు. మోకాలి గాయంతో ఆసియా కప్‌తో పాటు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన ఏడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు అఫ్రిది దూరమయ్యాడు. దీంతో అఫ్రిది టి20 ప్రపంచకప్ ఆడతాడా లేదా అనే సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పీసీబీ అధ్యక్షుడు రమీజ్ రజా.. టి20 ప్రపంచకప్ ఆడేందుకు షాహిన్ అఫ్రిది ఫిట్‌గా ఉన్నట్లు శుక్రవారం మీడియాకు తెలిపాడు. ''మీతో మాట్లాడడానికి ఒక్కరోజు ముందే నేను షాహిన్ అఫ్రిదితో మాట్లాడాను. తాను ఫిట్‌గా ఉన్నట్లు షాహిన్ చెప్పాడు. వైద్యులు కూడా తమ రిపోర్ట్స్‌లో అదే విషయాన్ని వెల్లడించారు. అతనికి సంబంధించిన వీడియోలను కూడా మాకు పంపించారు. ఆ వీడియోలో షాహిన్ ప్రాక్టీస్ చూస్తుంటే టీమిండియాతో మ్యాచ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక షాహిన్ ఫిట్‌గా ఉండడం మాకు సానుకూలాంశం. అయితే టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్ వరకు షాహిన్‌ను బరిలోకి దింపొద్దు అనుకున్నాం. కానీ షాహిన్ మాత్రం.. ''నేను 110 శాతం ఫిట్‌గా ఉన్నా.. నా గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆస్ట్రేలియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తా.'' అంటూ కాన్ఫిడెంట్‌గా చెప్పాడంటూ'' రమీజ్ మీడియాకు వెల్లడించాడు. ఇక పాకిస్తాన్ స్టార్ షాహిన్ అఫ్రిది గతేడాది టి20 ప్రపంచకప్‌లో టీమిండియాతో మ్యాచ్‌లో పాక్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్‌ను కకావికలం చేసిన అఫ్రిది మూడు వికెట్లతో చెలరేగాడు. ఆ టోర్నీలో సెమీఫైనల్ వరకు ఎదురులేకుండా సాగిన పాకిస్తాన్‌కు ఆస్ట్రేలియా అడ్డుకట్ట వేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో గెలిచిన ఆస్ట్రేలియా చాంపియన్‌గా అవతరించింది. మోకాలి గాయంతో బాధపడుతున్న మరొక పాక్ ఆటగాడు ఫఖర్ జమాన్‌ను టి20 ప్రపంచకప్‌కు స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. '' ఫఖర్ జమాన్ గాయంపై కూడా మంచి ప్రోగ్రెస్ ఉంది. అతను తర్వాగా కోలుకుంటున్నట్లు తెలిసింది. ఇదే నిమమైతే ఫఖర్ జమాన్ స్టాండ్ బై నుంచి తుది జట్టులోకి వచ్చే అవకాశముంది'' అంటూ రమీజ్ పేర్కొన్నాడు. చదవండి: దీపక్ చహర్‌కు గాయం..! ఎదురులేని రిజ్వాన్.. గెలుపుతో పాక్ బోణీ -
ఇకపై ప్రతి ఏడాది భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌లు..!
Ramiz Raja Proposal To ICC: దాయాదల పోరుకు సంబంధించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా సరికొత్త ప్రతిపాదనను ఐసీసీ ముందుంచాడు. ఇకపై భారత్, పాక్‌లతో సహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లను కలుపుకుని ప్రతి ఏడాది ఓ టీ20 టోర్నీ నిర్వహించాలని ఐసీసీని కోరాడు. ఈ టోర్నీని రొటేషన్ పద్దతిలో ఒక్కో ఏడాది ఒక్కో దేశంలో జరిగే విధంగా ప్లాన్ చేయాలని సూచించాడు. భారత్-పాక్, ఆసీస్-ఇంగ్లండ్ మ్యాచ్‌ల వ్యూయర్షిప్ను దృష్టిలో ఉంచుకుని ఈ టోర్నీని నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు ఐసీసీని ట్విటర్ వేదికగా కోరాడు. కాగా, రమీజ్ ప్రతిపాదనపై ఐసీసీ సహా బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం విశేషం. ఏదిఏమైనప్పటికీ రమీజ్ ప్రతిపాదనను క్రికెట్ అభిమానులు మాత్రం స్వాగతిస్తున్నారు. ఇలాంటి టోర్నీలు జరగడం శుభపరిణామమని అంటున్నారు. ఇదే జరిగితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు ఆర్ధికంగా మరింత బలపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇదిలా ఉంటే, చాలాకాలంగా భారత్-పాక్‌లు కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఎదురెదురుపడుతున్న విషయం తెలిసిందే. చదవండి: దక్షిణాఫ్రికాతో ఆఖరి టెస్ట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు -
పాక్ జట్టుకు బంపర్ ఆఫర్.. టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడిస్తే..?
Update: ఇక భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు సరిగ్గా 16 రోజుల కిత్రం పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా తమ జట్టు గెలవాలని ఆకాక్షించగా ఆయన కల నెరవేరింది. దాయాది జట్ల పోరులో పాక్‌నే విజయం వరించింది. ఆదివారం జరిగిన పోరులో భారత్‌ను 10 వికెట్లతో చిత్తు చేసి వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. ఓపెనర్లు మొహమ్మద్ రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్వితీయ ప్రదర్శన కనబర్చడంతో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 17.5 ఓవర్లలో పాక్ జట్టు గెలుపొందింది. PCB To Get Blank Cheque If Pakistan Beat Team India: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాక్ జట్ల మధ్య దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ నెల 24న జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ జట్టులో మనోస్థైర్యాన్ని నింపేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ఓ సంచలన ప్రకటన చేశాడు. మెగా ఈవెంట్లో భారత్‌ను మట్టికరిపిస్తే పాక్ జట్టుకు బ్లాంక్ చెక్ ఇస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అలాగే తమ దేశ పర్యటనను అర్దాంతరంగా రద్దు చేసుకున్న న్యూజిలాండ్ జట్టును కూడా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన బీసీసీఐని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీకి 90 శాతం నిధులు సమకూరుస్తుంది బీసీసీఐయేనని, భారత క్రికెట్ బోర్డు ఐసీసీకి నిధులు మళ్లించడం మానుకుంటే పీసీబీ కుప్పకూలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా, భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో గత కొనేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీల్లోనే మాత్రమే ఇరు జట్లు తలపడుతున్నాయి. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న పొట్టి ప్రపంచకప్‌లో దాయాదులు మరోసారి ఎదురెదురుపడనున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో పాక్ జట్టు ఒక్కసారి కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ మెగా ఈవెంట్లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా.. 5 మ్యాచ్‌ల్లో టీమిండియానే గెలుపొందింది. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో మేజర్ జట్ల మధ్య సూపర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభమవుతాయి. లీగ్ దశలో టీమిండియా తలపడబోయే మ్యాచ్‌ల విషయానికొస్తే.. అక్టోబర్ 24న పాక్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. చదవండి: మరోసారి వక్రబుద్ధిని చాటిన పాకిస్తాన్.. జెర్సీపై ఇండియా పేరు లేకుండానే... -
పీసీబీ అధ్యక్షుడిగా పాక్ ప్రధాని సన్నిహితుడు..
ఇస్లామాబాద్: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్‌గా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా నియామకం ఖరారైంది. పాక్ ప్రధానే స్వయంగా రంగంలోకి దిగి తన మాజీ సహచరుడిని పీసీబీ బాస్‌గా నియమించారు. ప్రస్తుత పీసీబీ చైర్మన్ ఎహ్సాన్ మణి పదవీకాలం ముగిసిన వెంటనే రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు పాక్ ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడినట్లు పాక్ మీడియా వెల్లడించింది. రమీజ్రాజా, ఎహ్సాన్ మణి ఇద్దరూ ఈనెల 23న ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగానే ఇమ్రాన్ ఖాన్.. పీసీబీ చైర్మన్ పదవికి రమీజ్ పేరును ప్రతిపాదించారు. కాగా, రమీజ్ రాజా.. 1984-1997 మధ్య కాలంలో పాక్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 57 టెస్టుల్లో 2833 పరుగులు.. 198 వన్డేల్లో 5851 పరుగులు సాధించాడు. 1992 ప్రపంచకప్ గెలిచిన పాక్ జట్టులో రమీజ్ సభ్యుడు. ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ హయాంలోనే పాక్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాక్ జట్టు విదేశీ పర్యటనల్లో బిజీగా ఉంది. రెండు రోజుల కిందటే విండీస్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంది. చదవండి: ఇంగ్లండ్ అభిమానుల ఓవరాక్షన్.. సిరాజ్‌పై బంతితో దాడి -
కోహ్లి మరో రిచర్డ్స్.. పాక్ మాజీ ఆటగాడి కితాబు
అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని నేటితరం రిచర్డ్స్‌తో పోలుస్తూ పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రజా ఆకాశానికెత్తేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషనపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి లాంటి క్లాస్, మాస్ ఆట కలయిక కలిగిన ఆటగాడితో ఇషాన్ తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్‌ను షేర్ చేసుకోవడం అతని అదృష్టమని అన్నాడు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో కోహ్లి లాంటి ఆటగాడు ఉంటే అది స్ట్రయిక్‌లో ఉన్న ఆటగాడికి ఎంతో బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కోహ్లి స్పూర్తితో ఇషాన్ కిషన్ మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆయన ఆకాంక్షించాడు. టీమిండియాలోకి కొత్తగా వచ్చిన ఇషాన్, సూర్యకుమార్ అపార ప్రతిభ, దూకుడు కలిగిన ఆటగాళ్లని.. ఇలాంటి వారికి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం అవకాశం లభించిందంటే అది ఐపీఎల్ చలవేనని ఆయన అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోకి ఇలాంటి ప్రతిభగల ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు టీమిండియా మేనేజ్మెంట్ను అభినందించాలని అన్నారు. యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడంలో కోహ్లి ఆధునిక రిచర్డ్స్‌తో సమానమని వెల్లడించాడు. దూకుడు, చాణక్యం కలగలిగిన కోహ్లి లాంటి ఆటగాడు టీమిండియా కెప్టెన్‌గా ఉండడం యువ ఆటగాళ్ల అదృష్టమని ఆయన పేర్కొన్నాడు. -
'స్నేహం పక్కన పెట్టి ఆడితే బాగుంటుంది'
లాహోర్ : పాకిస్తాన్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా పాక్ జట్టు వన్డే కెప్టెన్ బాబర్ అజామ్ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ను తప్పుబడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. 40 ఏళ్ల వయసుకు దగ్గర్లో ఉన్న మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లను టీ20 క్రికెట్లో ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ చురకలంటించాడు. అసలు పాక్ సెలెక్షన్ టీమ్‌కు సరైన ప్రణాళిక లేదని.. అందుకే వయసుమీద పడ్డవారిని ఆడిస్తున్నారని ఎద్దేవా చేశాడు. టీ20 అంటేనే యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహించాలి. కానీ కెప్టెన్‌గా బాబర్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ అలా ఆలోచించడం లేదని... స్నేహం పేరుతో యువకులకు అవకాశం ఇవ్వడం లేదంటూ విమర్శించాడు. (చదవండి : పృథ్వీ షా.. నీ ప్రతిభ అమోఘం) 'కెప్టెన్‌గా బాబర్ అజామ్ తప్పు చేస్తున్నాడు. టీ20 అనేది యువ ఆటగాళ్లను దృష్ఠిలో పెట్టుకొని రూపొందించింది. కానీ బాబార్ జట్టు మేనేజ్మెంట్తో కలిసి 40 ఏళ్లకు దగ్గరలో ఉన్న హఫీజ్, మాలిక్‌లను ట20 జట్టుకు ఎంపిక చేయించాడు. ఇది కరెక్ట్ కాదు.. హఫీజ్, మాలిక్‌లు ఇద్దరు అద్భుతమైన ఆటగాళ్లే.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. టీ20 జట్టులో ఈ ఇద్దరు పనికిరారు. రాబోయే రెండేళ్లలో రెంటు టీ20 ప్రపంచకప్‌లు ఆడనున్న పాక్ జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తే బాగుంటుంది. బాబర్ అజామ్ స్నేహం అనే పదాన్ని పక్కనపెడితే బాగుంటుంది. అయినా కెప్టెన్‌తో పాటు జట్టును ఎంపిక చేసే సెలక్షన్ టీమ్ ధోరణి సరిగా లేదు.జట్టులో ఎప్పటికప్పుడు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇస్తుండాలి. (చదవండి : ‘ఆ బౌలర్‌తో బ్యాట్స్‌మెన్‌కు చుక్కలే’) మా సమయంలో ఇలా ఉండేది కాదు.. ఇమ్రాన్ కొత్తగా కెప్టెన్ అయిన సమయంలో మార్పు పేరుతో ఐదు నుంచి ఆరు మంది సీనియర్ ఆటగాళ్లను వన్డే జట్టులో నుంచి తప్పించాం. కేవలం స్థిరంగా ఆడుతున్న జావేద్ మియాందాద్ లాంటి ఆటగాడిని మాత్రమే కొనసాగించాం. యువ ఆటగాళ్లతో నిండిన పాక్ జట్టు 1992లో ప్రపంచకప్ సాధించేవరకు వెళ్లగలిగింది. ఇప్పుడు మాత్రం జట్టు మేనేజ్మెంట్ అలా కనిపించడం లేదు. ఎప్పుడైనా ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొనే ఆటగాళ్ల ఎంపిక జరగాలి.. భవిష్యత్తుకు కూడా అదే మంచిది.' అంటూ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. -
పాక్ యువ సంచలనం షహీన్
దుబాయ్ : వసీం అక్రం, వకార్ యూనిస్, షాహిద్ ఆఫ్రిది వంటి దిగ్గజాలు తమ ప్రదర్శనతో పాకిస్తాన్ క్రికెట్ బౌలింగ్‌కు పర్యాయ పదాలుగా నిలిచారు. ఇప్పుడు మరో ‘ఆఫ్రిది’ తెరపైకి వచ్చాడు. తన ప్రదర్శనతో దుమ్ములేపుతున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో లాహోర్ క్వాలాండర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న షహీన్ ఆఫ్రిది కేవలం 4 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆరడుగుల ఆరు అంగుళాల ఎత్తు ఉండే షహీన్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగలడు. యార్కర్లను సంధించడంలోనూ దిట్ట. షహీన్‌కు ఆ దేశ దిగ్గజ పేసర్ వసీం అక్రం ఆదర్శం. వసీం అక్రమ్ తరహాలో ఎడమ చేతి వాటం బౌలర్. ఇక్కడ వసీం లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలరైతే, షహీన్ది లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్. లాహోర్ క్వాలాండర్స్, ముల్తాన్ సుల్తాన్స్ మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముల్తాన్ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ప్రధానంగా 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. ఇలా తన అద్భుత ప్రదర్శనతో ముల్తాన్ సుల్తాన్స్ జట్టును 114 పరుగులకే కట్టడి చేశాడు. ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్ హెరాత్ న్యూజిలాండ్‌పై, రషీద్ ఖాన్ ఐర్లాండ్‌పై, సోహైల్ తన్వీర్ ట్రిడెంట్స్ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ పై) కిందకి నెట్టి షహీన్ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు. అనతికాలంలోనే పాకిస్తాన్ క్రికెట్లోకి దూసుకొచ్చిన 17 ఏళ్ల యువ సంచలనం షహీన్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా బాగానే సంపాదించుకున్నాడు. అందులో పాక్ దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ రమీజ్ రాజా కూడా ఉండటం విశేషం. ‘ ఒక కొత్త స్టార్ జన్మించాడు.. 17 ఏళ్ల షహీన్ ఆఫ్రిది పీఎస్ఎల్లో 5 వికెట్లు తీసిన యువ ఆటగాడు.. 22 బంతులు విసిరితే అందులో 18 డాట్ బాల్స్ ఉండటం అతని అద్భుత ప్రదర్శనకు నిదర్శనం.. ’అని అతని బౌలింగ్‌కు ఫిదా అయిన రమీజ్ రాజా ప్రశంసలు కురిపిస్తూ ట్వీట్ చేశాడు. A new star is born .. 17 year old Shaheen Afridi is youngest to 5 wickets in HBLPSL.. a triple wicket maiden over and 18 dots out of 22 bowled .. you kidding me.. — Ramiz Raja (@iramizraja) March 9, 2018 -
పాకిస్తాన్‌కు ఓ ద్రవిడ్ కావాల్సిందే..!
కరాచీ: టీమిండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కోచింగ్‌లో యువ భారత్ తమ జోరు కొనసాగిస్తుండటంతో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత క్రికెటర్లు, మాజీ దిగ్గజాలతో పాటు పాకిస్తాన్ క్రికెటర్లు సైతం ద్రవిడ్ నైపుణ్యాన్ని, ఆటపట్ల అతడి అంకితభావాన్ని కొనియాడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌లో తమ ప్రతి ప్రత్యర్థి జట్టును చిత్తుచేసిన యువ టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా సైతం యువ భారత్ విజయాలపై స్పందిస్తూ ద్రవిడ్ లాంటి వ్యక్తి వారి దేశానికి కావాలని అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా ‘అండర్ 19 క్రికెట్ జట్టు రాహల్ ద్రవిడ్ అద్భుతమైన కోచింగ్ ఇస్తున్నారు. పాకిస్తాన్‌కు ద్రవిడ్ లాంటి వ్యక్తే కావాలి. అతడి కోచింగ్‌లో శుబ్మాన్ గిల్, మరికొందరు యువ సంచలనాలు తయారయ్యారు. ఒత్తిడిని ఎదుర్కొని ఎలా ఆడాలో జట్టును బాగా సిద్ధం చేశాడు ద్రవిడ్. భారత యువ క్రికెటర్లు ద్రవిడ్ నుంచి ఎంతో నేర్చుకుంటున్నారు. ఆటతో పాటు అంకితభావాన్ని, నిబద్ధతను కూడా వారు అలవాటు చేసుకుని వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. సెమిస్లో పాక్ బ్యాటింగ్ చాలా దారుణంగా ఉంది. ద్రవిడ్ కోచింగ్ ఇచ్చిన జట్టు చేతిలో యువ పాక్ జట్టు 203 పరుగుల తేడాతో దారుణ ఓటమి చవిచూసిందంటేనే ఆ కోచ్ ఆటగాళ్లలో ఎంత ఉత్సాహాన్ని నింపుతారో అర్థమవుతోంది. అందుకే పాకిస్తాన్‌కు ఓ ద్రవిడ్ అవసరం ఎంతైనా ఉందని’ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా పేర్కొన్నారు. -
పాక్ సూపర్ లీగ్ ఐపీఎల్లా అలరిస్తుందా!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తర్వరలో ప్రారంభించనున్న పాకిస్థాన్ టీ20 సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పోటీలు హిట్ అవుతాయా! ఆసియాలోని క్రికెట్ అభిమానులందరిలో ఇదే సందేహం. క్రికెట్‌ను వెర్రిగా ప్రేమించే దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాత ఎక్కువ మంది అభిమానులున్నది పాకిస్థాన్‌కే. ఇప్పుడిప్పుడే ఆట నేర్చుకుంటున్న ఇస్లామిక్ దేశాల్లోనూ క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే అభిమానులకు మజాను అందించడంతోపాటు కాస్తంత సొమ్ము కూడా చేసుకుందామనే భావనతో పొట్టి క్రికెట్ పోటీలను తెరపైకి తెచ్చింది పీసీబీ. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న దోహా (ఖతార్) వేదికగా పీఎస్ఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. 20 రోజులపాటు అంటే.. 24వ తేదీ వరకు జరిగే మొదటి సీజన్ లో మొత్తం ఐదు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఇక ఈ టోర్నీకి ప్రచారకర్తలు (బ్రాండ్ అంబాసిడర్లు)గా మాజీ క్రికెటర్లు వసీం అక్రం, రమీజ్ రాజాలు నియమితులయ్యారు. పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ మంగళవారం వీరి నియామకాలను ఖరారుచేశారు. దీంతో వసీం, రమీజ్‌లు ఐపీఎల్‌కు దూరం కానున్నారనే వార్తలూ వినవస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలింగ్ కోచ్‌గా వసీం అక్రం.. వ్యాఖ్యత, విశ్లేషకుడిగా రమీజ్‌లు ఐపీఎల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. -
ఆసీస్ బలహీనతలపై దృష్టి పెట్టాలి
భారత బౌలర్లకు రమీజ్ రాజా సూచన న్యూఢిల్లీ: ప్రపంచకప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాను దీటుగా ఎదుర్కోవాలంటే తమ బౌలర్ వహాబ్ రియాజ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని భారత బౌలర్లకు పాక్ మాజీ కెప్టెన్ రమీజ్ రాజా సూచించారు. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో రియాజ్ అద్భుతమైన స్పెల్‌తో చెలరేగాడని గుర్తు చేశారు. ‘రియాజ్ బంతితో అద్భుతాలు చేశాడు. అతని వేగం, కచ్చితమైన బౌన్సర్లకు స్టార్లతో కూడిన ఆసీస్ లైనప్ వద్ద సమాధానం లేకపోయింది. పాక్ మ్యాచ్ అయితే ఓడిపోయిందేమోగానీ రియాజ్ బౌలింగ్ సూపర్బ్. కాబట్టి భారత బౌలర్లు ఆసీస్ బలహీనతలపై దృష్టిపెట్టాలి’ అని రమీజ్ పేర్కొన్నారు. ఆసీస్‌తో మ్యాచ్ ఓడటానికి పాక్ ఫీల్డింగ్ వైఫల్యమే కారణమన్నారు. ‘పాక్ జట్టు ఫీల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా లేదు. ఆటగాళ్లలో చురుకుదనం కొరవడింది. దీనివల్ల కీలక సమయాల్లో సులువైన క్యాచ్‌లు కూడా జారవిడిచారు. ఉత్తమ ఫీల్డర్లను సరైన ప్రదేశాల్లో నిలబెట్టాలి. కానీ మిస్బా పాతకథే పునరావృతం చేశాడు. మంచి ఫీల్డర్‌ను తీసుకెళ్లి బౌండరీ లైన్ వద్ద పెట్టాడు. దీనివల్ల ఏం లాభం’ అని రమీజ్ విమర్శించారు. ప్రస్తుతం భారత్, ఆసీస్ సెమీస్ మ్యాచ్‌పైనే అందరి దృష్టి నెలకొందన్నారు.