అహ్మదాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిని నేటితరం రిచర్డ్స్‌తో పోలుస్తూ పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రజా ఆకాశానికెత్తేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో అరంగేట్రం మ్యాచ్‌లోనే అద్భుతమైన అర్ధసెంచరీతో ఆకట్టుకున్న ఇషాన్ కిషనపై కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లి లాంటి క్లాస్, మాస్ ఆట కలయిక కలిగిన ఆటగాడితో ఇషాన్ తొలి మ్యాచ్‌లోనే ఇన్నింగ్స్‌ను షేర్ చేసుకోవడం అతని అదృష్టమని అన్నాడు. నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో కోహ్లి లాంటి ఆటగాడు ఉంటే అది స్ట్రయిక్‌లో ఉన్న ఆటగాడికి ఎంతో బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నాడు. కోహ్లి స్పూర్తితో ఇషాన్ కిషన్ మరిన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాలని ఆయన ఆకాంక్షించాడు.
టీమిండియాలోకి కొత్తగా వచ్చిన ఇషాన్, సూర్యకుమార్ అపార ప్రతిభ, దూకుడు కలిగిన ఆటగాళ్లని.. ఇలాంటి వారికి జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం అవకాశం లభించిందంటే అది ఐపీఎల్ చలవేనని ఆయన అభిప్రాయపడ్డాడు. తుది జట్టులోకి ఇలాంటి ప్రతిభగల ఆటగాళ్లను ఎంపిక చేసినందుకు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను అభినందించాలని అన్నారు. యువ ఆటగాళ్లకు స్వేచ్ఛనివ్వడంలో కోహ్లి ఆధునిక రిచర్డ్స్‌తో సమానమని వెల్లడించాడు. దూకుడు, చాణక్యం కలగలిగిన కోహ్లి లాంటి ఆటగాడు టీమిండియా కెప్టెన్‌గా ఉండడం యువ ఆటగాళ్ల అదృష్టమని ఆయన పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment