Pakistani Fans Chant Security, Security After Thrashing New Zealand: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా న్యూజిలాండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం పాక్ అభిమానులు ఓవరాక్షన్ చేశారు. కివీస్ ఆటగాళ్లను టార్గెట్ చేస్తూ.. సెక్యూరిటీ, సెక్యూరిటీ అంటూ కేకలు వేశారు. ఈ మెగా టోర్నీకి ముందు న్యూజిలాండ్ జట్టు పాక్ పర్యటనను రద్దు చేసుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. కివీస్ ఆటగాళ్లను హేళన చేశారు. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు విష్ చేసుకునే సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Pakistanis hooting "Security Security" Lmao. Day made.#PakvsNz pic.twitter.com/Egpv4ALBLN
— Ambreeeen.. (@Nostalgicc_A) October 26, 2021
ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్.. న్యూజిలాండ్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొంది, మెగా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, పరిమిత ఓవర్ల సిరీస్ ఆడేందుకు న్యూజిలాండ్ జట్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే, తొలి వన్డేకు కొద్ది నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా సిరీస్ మొత్తాన్ని రద్దు చేసుకుంది. కివీస్ తీసుకున్న ఈ నిర్ణయానికి పాక్ క్రికెట్ కుదుపునకు లోనైంది.
చదవండి: న్యూజిలాండ్‌కు షాక్‌ల మీద షాక్‌లు.. గాయంతో మరో ఆటగాడు ఔట్
Comments
Please login to add a commentAdd a comment