Vinesh Phogat: ఆస్పత్రి పాలైన వినేశ్‌.. కారణం ఇదే! | Paris Olympics 2024: Vinesh Phogat Taken Hospitalized Due To This Reason | Sakshi
Sakshi News home page

Vinesh Phogat: ఆస్పత్రి పాలైన వినేశ్‌.. కారణం ఇదే!

Published Wed, Aug 7 2024 1:24 PM | Last Updated on Wed, Aug 7 2024 1:56 PM

Paris Olympics 2024: Vinesh Phogat Taken Hospitalized Due To This Reason

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ అస్వస్థతకు గురైనట్లు సమాచారం. డీ హైడ్రేషన్‌తో ఆమె ఆస్పత్నిలో చేరినట్లు తెలుస్తోంది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో మహిళల 50 కేజీలవిభాగంలో వినేశ్‌ ఫొగట్‌ పోటీపడిన విషయం తెలిసిందే.

సంచలన విజయాలతో ఫైనల్‌ చేరుకున్న ఈ హర్యానా రెజ్లర్‌ .. బుధవారం పసిడి పట్టు పట్టాల్సి ఉంది. అయితే, 50 కేజీల కంటే వినేశ్‌ 100 గ్రాముల అధిక బరువు ఉందన్న కారణంతో ఆమెపై వేటు పడింది. ఈ నేపథ్యంలో పతక ఆశలు నీరుగారిపోయాయి.

అయితే, రాత్రికి రాత్రే వినేశ్‌ కేజీ బరువు తగ్గేందుకు తీవ్రమైన కసరత్తులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాత్రంతా వర్కౌట్‌ చేసిన ఆమె.. స్కిప్పింగ్‌, సైక్లింగ్‌, జాగింగ్‌తో వినేశ్‌ ఫొగట్‌ బిజీగా గడిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డీ హైడ్రేషన్‌కు గురైన వినేశ్‌ ఫొగట్‌ను భారత అధికారులు సమీప ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

చదవండి: వినేశ్‌ ఫొగట్‌పై వేటు: ప్రధాని మోదీ స్పందన.. కీలక ఆదేశాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement