కోల్‌కతా: ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్ ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్ త్వరలోనే బుల్లి కమిన్స్‌కు జన్మనివ్వనున్నారు. మదర్స్ డే సందర్భంగా బెకీ బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘తొలి మాతృదినోత్సవం.. మినీ బంప్‌తో’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన కేకేఆర్.. ‘‘మదర్స్ డే నాడు ఎంత గొప్ప శుభవార్త చెప్పారు’’ అంటూ కమిన్స్- బెకీ జంటకు ట్విటర్ వేదికగా విషెస్ తెలిపింది. దీంతో కాబోయే తల్లిదండ్రులకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఐపీఎల్-2021 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్యాట్ కమిన్స్.. కరోనాపై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా తన వంతు విరాళం అందించి పెద్దమనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీ నిరవధికంగా వాయిదా పడినప్పటికీ, ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల కారణంగా అతడు స్వదేశానికి వెళ్లలేకపోయాడు. కాగా కమిన్స్ ఐపీఎల్ ఆడుతున్న సమయంలోనే బెకీ తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు. ‘‘ఈ సంతోషాన్ని ఇంక దాచి ఉంచటం నావల్ల కాదు. బేబీ బోస్టన్ కమిన్స్ రాబోతోంది. నిన్ను కలవడానికి మేమెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం’’ అంటూ గుడ్‌న్యూస్ షేర్ చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కమిన్స్ మాట్లాడుతూ.. ‘‘మేం చాల సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మేం మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి చేసుకుంటాం. అయితే, ఆలోపే ఈ చిన్నారి మా జీవితాల్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. బెకీ, బేబీ బాగున్నారు. త్వరలోనే ఇంటికి వెళ్లి వాళ్లను కలుస్తాను’’అని చెప్పుకొచ్చాడు. కాగా గతేడాది ఫిబ్రవరిలో కమిన్స్- బెకీ నిశ్చితార్థం జరిగింది. సుమారు తొమ్మిదిన్నర మిలియన్ డాలర్లతో సిడ్నీలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా ఆసీస్ జట్టులో కమిన్స్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: ఐపీఎల్ 2021: ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే డబ్బు చెల్లించండి
Comments
Please login to add a commentAdd a comment