న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా ఆటగాడు పాట్ కమిన్స్ వ్యక్తిగత కారణాల వల్ల లీగ్‌కు దూరం కానున్నాడు. ఈ స్టార్ ఆటగాడు ఐపీఎల్‌తో పాటు త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియాకు పరోక్షంగా తెలిపినట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్‌లో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన కమిన్స్.. లీగ్‌కు దూరం కావడం కేకేఆర్ విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది,
కమిన్స్‌తో పాటు ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా విండీస్ పర్యటన నుంచి తప్పుకున్నాడు. చాలా కాలంగా బయో బబుల్‌లో ఉన్న ఈ ఆటగాళ్లు.. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు కుటుంబంతో గడిపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరితో పాటు మరి కొంత మంది ఆసీస్ ఆటగాళ్లు కూడా విండీస్ పర్యటనతో పాటు ఐపీఎల్‌కు డుమ్మా కొట్టే ఉద్ధేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఐపీఎల్ 14వ ఎడిషన్‌లో మిగిలిన 31 మ్యాచ్‌లను యూఏఈ వేదికగా సెప్టెంబరు 18 నుంచి అక్టోబరు 10 మధ్యలో నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి: భారత సీ జట్టు వెళ్లినా సునాయాసంగా గెలుస్తుంది..
Comments
Please login to add a commentAdd a comment