
భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్స్ పతక విజేత పీవీ సింధు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. శనివారం పీవీ సింధు, వెంకట దత్తసాయి ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను సింధు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నది.
"ఒకరి ప్రేమ మనకు దక్కినప్పుడు, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తానుగా ఏమీ ఇవ్వదు" అని లెబనీస్ రచయిత ఖలీల్ జిబ్రాన్ కోట్‌ను క్యాప్షన్‌గా సింధు జోడించింది. ఎంగేజ్‌మెంట్ సందర్భంగా ఇద్దరూ కేక్ కట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కాగా డిసెంబర్ 22న ఉదయ్‌పూర్ వేదికగా సింధు-సాయి జంట వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. సింధు వివాహ వేడుకలు ఈ నెల 20 నుంచే ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఇరు కుటంబాలు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాయి. ఈ కాబోయే జంట ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వంటి ప్రముఖలను తమ పెళ్లికి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment