IPL 2023, CSK Vs RR: ఏంటి అశ్విన్‌ ప్రతీసారి ఇలా.. రహానే కూడా తక్కువ కాదు! వీడియో వైరల్‌ | R Ashwin Engage In On-Field Banter With Ajinkya Rahane, Video Viral - Sakshi
Sakshi News home page

IPL 2023: ఏంటి అశ్విన్‌ ప్రతీసారి ఇలా.. రహానే కూడా తక్కువ కాదు! వీడియో వైరల్‌

Published Thu, Apr 13 2023 8:48 AM | Last Updated on Thu, Apr 13 2023 9:44 AM

R Ashwin engage in on field banter with Ajinkya Rahane - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2023లో వరుసగా మూడు మ్యాచ్‌లో గెలవాలన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆశలపై రాజస్తాన్‌ రాయల్స్‌ నీళ్లు చల్లింది. బుధవారం చెపాక్‌ వేదికగా రాజస్తాన్‌తో జరిగిన ఉత్కంఠపోరులో 3 పరుగుల తేడాతో సీఎస్‌కే ఓటమిపాలైంది. సీఎస్‌కే కెప్టెన్‌ ఎంస్‌ ధోని ఆఖరి వరకు పోరాడనప్పటికీ తన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

ఆఖరి ఓవర్‌లో సీఎస్‌కే విజయానికి 21 పరుగులు అవసరమవ్వగా.. సందీప్‌ శర్మ 19 పరుగులు మాత్రమే చేశాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఇన్నింగ్స్‌ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, సీఎస్‌కే బ్యాటర్‌ అజింక్యా రహానేల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. 
ఏం జరిగిందంటే?
సీఎస్‌కే ఇన్నింగ్స్‌ 6 ఓవర్‌ వేయడానికి రవి చంద్రన్‌ అశ్విన్‌ వచ్చాడు. తొలి బంతికి రహానే రెండు పరుగులు సాధించి.. స్ట్రైక్‌ను తనవైపే ఉంచుకున్నాడు. రెండో బంతిని వేసేందుకు సిద్దమైన అశ్విన్‌.. చివరి క్షణంలో చేతిని తిప్పి బంతిని వేయకుండా ఆపేశాడు. దీంతో రహానే కాస్త అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో రహానే కూడా అశ్విన్‌కు రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు.

మూడో బంతిని అశ్విన్‌ వేసే క్రమంలో రహానే ఒక్క సారిగా క్రీజు నుంచి పక్కకు వెళ్లిపోయాడు. అనంతరం మూడో బంతిని రహానే అద్భుతమైన సిక్స్‌గా మలిచాడు. దీంతో అశ్విన్‌ ఒక్క సారిగా రహానే వైపు సీరియస్‌గా చూశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు,వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఇది చూసిన నెటిజన్లు.. ఏంటీ అశ్విన్‌ ప్రతీ సారి ఇలానే చేస్తున్నావు.. రహానే సరైన సమాధానం చెప్పాడంటూ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement