చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో లోకల్ బాయ్, టీమిండియా వెటరన్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు విఫలమైన చోట.. అశ్విన్ విధ్వంసం సృష్టించాడు.
ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అశ్విన్ తన విరోచిత పోరాటంతో జట్టును ఆదుకున్నాడు. రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్‌కు 195 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని అశూ నెలకొల్పాడు. ఈ క్రమంలో కేవలం 108 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను ఈ స్పిన్ మాస్ట్రో అందుకున్నాడు.
ప్రస్తుతం అశ్విన్ 102 పరుగులతో క్రీజులో ఆజేయంగా ఉన్నాడు. కాగా అశ్విన్‌కు ఇది ఆరో టెస్టు సెంచరీ. తద్వారా పలు అరుదైన రికార్డులను అశ్విన్ తన పేరిట లిఖించుకున్నాడు.
అశ్విన్ సాధించిన రికార్డులు ఇవే..
అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించడం ఇది 20వ సారి కావడం గమనార్హం. దీంతో వరల్డ్ టెస్టు క్రికెట్ హిస్టరీలోనే 20కి పైగా ఫిప్టీ ప్లస్ స్కోర్లు, 30కి పైగా ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన తొలి క్రికెటర్‌గా అశ్విన్ నిలిచాడు. అశ్విన్ టెస్టుల్లో ఇప్పటివరకు 36 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
ఈ క్రమంలోనే ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో అశ్విన్ వేసుకున్నాడు. కాగా అశ్విన్ తర్వాతి స్దానంలో న్యూజిలాండ్ క్రికెట్ దిగ్గజం రిచర్డ్ హ్యాడ్లీ ఉన్నాడు. 17 పైగా 50+ స్కోర్లు, 30 కంటే ఎక్కువ ఫైవ్ వికెట్ల హాల్స్ అతడి పేరిట ఉన్నాయి.
⇒అదే విధంగా ఒకే వేదికలో రెండు టెస్టు సెంచరీలతో పాటు అత్యధిక ఫైవ్ వికెట్ల హాల్స్ సాధించిన క్రికెటర్‌గా అశ్విన్ రికార్డులకెక్కాడు. అశ్విన్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రెండు సెంచరీలతో పాటు 4 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ పేరిట ఉండేది. బోథమ్ లీడ్స్‌లో రెండు సెంచరీలతో పాటు 3 సార్లు 5 వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో బోథమ్ ఆల్‌టైమ్ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment