న్యూఢిల్లీ: భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కోవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోసును గురువారం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమంలో షేర్ చేసిన అతను... ‘నా తొలి డోసు పూర్తయింది. మీరూ అర్హులై ఉంటే దయచేసి ముందుకు రండి... వ్యాక్సిన్ వేయించుకోండి. మనమెంత త్వరగా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామో... అంత త్వరగా కరోనాను జయిస్తాం’ అని ట్వీట్ చేశాడు.
ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో జరిగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 23 ఏళ్ల పంత్ ఎంపికయ్యాడు.
(చదవండి: భారత్‌దే అగ్రస్థానం)
Comments
Please login to add a commentAdd a comment