అంతర్జాతీయ టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్ ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసిన హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ టెస్టుల్లో వరుసగా 30 ఇన్నింగ్స్‌ల్లో రెండంకెల స్కోరు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక దిగ్గజం మహేలా జయవర్ధనే పేరిట ఉండేది. జయవర్ధనే వరుసగా 29 టెస్టు ఇన్నింగ్స్‌లలో రెండంకెల స్కోరు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో జయవర్ధనే రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. ఇక రోహిత్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్టులో సెంచరీతో చెలరేగిన హిట్‌మ్యాన్.. రెండో టెస్టులో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు సాధించాడు.
ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో రోహిత్ 240 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తమ విజయానికి 8 వికెట్ల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన ఆధిక్యంతో కలిపి వెస్టిండీస్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యం నిలిపింది. 365 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. క్రీజులో చంద్రపాల్(24), బ్లాక్‌వుడ్(20) పరుగులతో ఉన్నారు.
చదవండి: IND Vs WI: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా! ఇంగ్లండ్‌కు కూడా సాధ్యం కాలేదు
Comments
Please login to add a commentAdd a comment