IPL 2022: If Rohit Sharma Continues Next Slow-Over Then He Will Be Banned for One Match - Sakshi
Sakshi News home page

IPL 2022: రోహిత్‌ శర్మకు భారీ మూల్యం తప్పదు..!   

Published Fri, Apr 15 2022 6:56 PM | Last Updated on Fri, Apr 15 2022 7:31 PM

Rohit Sharma May Face One Match Ban For Slow Over Rate - Sakshi

Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 సీజన్‌ ముంబై ఇండియన్స్‌కు ఏమాత్రం కలిసి రావట్లేదు. ఈ సీజన్‌లో రోహిత్‌ సేన ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఎన్నడూ లేనంత ధీన స్థితిని ఎదుర్కొంటుంది. ఇది చాలదన్నట్లుగా ఆ జట్టును మరో సమస్య భయపెడుతుంది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఇప్పటికే 2 మ్యాచ్‌ల్లో ఫైన్లతో గట్టెక్కిన ఆ జట్టు సారధి.. సేమ్‌ సీన్‌ మరో మ్యాచ్‌లో రిపీట్‌ అయితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఈ సీజన్‌లో ముంబై ఇండియ‌న్స్ మరో మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేస్తే, జట్టుగా సారధి రోహిత్‌ శర్మపై ఓ మ్యాచ్ నిషేధం తప్పనిసరి అవుతుంది. 

కాగా, నిర్ణీత స‌మ‌యంలో 20 ఓవర్ల కోటాను పూర్తి చేయ‌లేని కార‌ణంగా పంజాబ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రోహిత్‌కు 24 లక్షల జ‌రిమానా విధించారు. అత‌నితో పాటు జ‌ట్టు సభ్యులందరికీ తలో 6 ల‌క్ష‌ల ఫైన్‌ వేశారు. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ రోహిత్‌కు 12 ల‌క్ష‌ల జ‌రిమానా ప‌డింది. ఒక‌వేళ ఇదే సీన్‌ మూడోసారి రిపీటైతే ఐపీఎల్‌ సవరించిన రూల్స్‌ ప్రకారం 30 ల‌క్ష‌ల జ‌రిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించే అవ‌కాశం ఉంది. 
చదవండి: ఐపీఎల్‌లో కరోనా కలకలం.. సీజన్‌లో తొలి కేసు నమోదు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement