
Rohit sharma, Rahul creates Record in T20 Internationals: న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా జైపూర్ వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన తొలి టీ-20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించారు. టాస్ ఓడి ముందు బ్యాటింగ్ దిగిన న్యూజిలాండ్.. భారత్‌కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
166 పరుగుల లక్ష్యచేధనతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభం ఇచ్చారు. ఈ క్రమంలో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ఈ ఓపెనింగ్ జోడి.. సరికొత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ జోడీ టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరఫున అత్యధిక ఆర్ధ సెంచరీల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచింది. వీరిద్దరికి ఇది 12 అర్ధ సెంచరీల భాగస్వామ్యం. అంతకు ముందు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కలిసి 11 అర్ధ సెంచరీల భాగస్వామ్యం నమోదు చేశారు.
చదవండి: Suryakumar Yadav: కోహ్లి నాకోసం త్యాగం చేశాడు... అయినా ఏ స్థానంలో వచ్చినా