టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య విండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్‌లకు భారత జట్టును జూన్ 27న బీసీసీఐ ప్రకటించనుంది. జూలై 12న డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో భారత్ టూర్ ప్రారంభం కానుంది.
ముఖేష్ కుమార్ అరంగేట్రం..
ఇక విండీస్‌తో టెస్టులకు స్టార్ పేసర్లు మహ్మద్ షమీ, సిరాజ్‌కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అదే విధంగా గత కొన్ని సిరీస్‌లగా జట్టుతో పాటు ఉన్న జయదేవ్ ఉనద్కట్‌కు తుది జట్టులో ఛాన్స్ ఉంది.
మరోవైపు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. రోహిత్, విరాట్, పుజారాను విండీస్‌తో టెస్టులకు కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా వన్డే సిరీస్‌లో కూడా పుజారా మినహా మిగితా ఆటగాళ్లను సెలక‍్టర్లు ఎంపికచేసే అవకాశం ఉంది. అయితే యువ ఆటగాడు జైశ్వాల్‌కు వన్డే జట్టులో చోటుదక్కే ఛాన్స్ ఉన్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలవెన్‌లో మాత్రం చోటు కష్టమనే చెప్పుకోవాలి.
గిల్‌కు విశ్రాంతి.. జైశ్వాల్, రింకూ ఎంట్రీ!
ఇక ఆఖరిగా జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టులో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్, మహ్మద్ షమీకి విశ్రాంతి ఇవ్వాలి అని సెలక‍్టర్లు యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో యశస్వీ జైశ్వాల్, రింకూ సింగ్ అరంగేట్రం చేసే అవకాశం ఉండగా.. మరో యువ ఆటగాడు రుత్‌రాజ్ గైక్వాడ్ రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన వెటరన్ పేసర్ మొహిత్ శర్మ కూడా పునరాగమనం చేయనున్నట్లు సమాచారం.
చదవండి: Pat Cummins: ఇంతకు మించి ఏమి కావాలి.. చాలా సంతోషంగా ఉంది! అతడొక క్లాస్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment