
విక్టోరియా- సౌత్ ఆస్ట్రేలియా మ్యాచ్‌లో దృశ్యం(ఫొటో కర్టెసీ: ఫాక్స్ క్రికెట్ ట్విటర్)
సిడ్నీ: మార్ష్ కప్ టోర్నీలో భాగంగా విక్టోరియా ఓపెనర్ సామ్ హార్పర్ ప్రవర్తించిన తీరు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. సౌత్ ఆస్ట్రేలియా- విక్టోరియా మధ్య జరిగిన ఆసీస్ దేశవాళీ వన్డే మ్యాచ్‌లో డేనియల్ వారల్ బౌలింగ్ చేస్తున్న క్రమంలో సామ్ పరుగు తీసేందుకు యత్నించాడు. అయితే, అంతలోనే బంతి డేనియల్ చేతికి చిక్కడంతో నేరుగా వికెట్లకు గిరాటేసేందుకు ప్రయత్నించాడు. కానీ, అవుట్ కావడం ఇష్టంలేని సామ్, వికెట్లకు అడ్డంగా నిలబడి ఉద్దేశపూర్వకంగానే బంతిని అడ్డుకున్నాడు. దీంతో, డేనియల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
ఇక ఈ ఘటనపై సౌత్ ఆస్ట్రేలియా కెప్టెన్ ట్రవిస్ హెడ్ సైతం సామ్ తీరుకు షాకయ్యాడు. వెంటనే ఆన్- ఫీల్డ్ ఎంపైర్ల దగ్గరకు వెళ్లి చర్చించాడు. ఆ తర్వాత విషయం థర్డ్ అంపైర్ దగ్గరకు చేరగా, ఐసీసీ నిబంధనల ప్రకారం సామ్‌ను అవుట్‌గా ప్రకటించాడు. క్రీజు బయట ఉన్నందుకు అతడు పెవిలియన్‌కు చేరకతప్పలేదు. కాగా కామెంట్రీ బాక్స్‌లో ఉన్న ఆసీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘డేనియల్ వందకు వంద శాతం కరెక్ట్‌గానే త్రో చేశాడు. ఆ బంతి కచ్చితంగా మిడిల్ లెగ్ స్టంప్‌ను తాకి ఉండేది.
నిజానికి సామ్ క్రీజు బయట ఉన్నాడు. స్టంప్స్‌ను తాకకుండా బంతిని అడ్డుకుని నిబంధనలు ఉల్లంఘించాడు. అబ్‌స్ట్రక‌్షన్‌కు ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్’’ అని వ్యాఖ్యానించాడు. డేనియల్ అప్పీలు చేసి మంచి పనిచేశాడని ప్రశంసించాడు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికా- పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ డబుల్ సెంచరీకి చేరువలో ఉన్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడంటూ విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
చదవండి: ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ
ఐపీఎల్ కోసం మరీ ఇలా చేస్తారా; నువ్వైతే ఆడొచ్చు కానీ?!
Ummm.... What? 🤨 Sam Harper is out for obstruction after moving into the path of a ball 🤷♂️ #sheffieldshield pic.twitter.com/z5SnoxUjPR
— Fox Cricket (@FoxCricket) April 8, 2021