Photo: IPL Twitter
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్ 44, బట్లర్ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు.
అయితే ఒక దశలో 12 ఓవర్లు వరకు వికెట్ కోల్పోని రాజస్తాన్ 87/0తో పటిష్టంగా కనిపించింది. ఈజీగా గెలుస్తుందనుకుంటే స్టోయినిస్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం.. శాంసన్ రనౌట్ కావడం రాజస్తాన్‌ను ముంచింది. ఆ తర్వాత హెట్‌మైర్ కూడా తక్కువ స్కోరుకే వెనుదిరగడం ఓటమిని ఖరారు చేసింది. ఆఖర్లో పడిక్కల్ ఏదో పోరాడే ప్రయత్నం చేసినప్పటికి లాభం లేకపోయింది.
ఇక మ్యాచ్ ఓటమి అనంతరం రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ మాట్లాడుతూ.. ''దాదాపు నాలుగేళ్ల తర్వాత హోంగ్రౌండ్‌లో ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నాం. జైపూర్‌లో విజయంతో ప్రారంభించాలనుకున్నాం. కానీ కోరిక నెరవేరలేదు. అయితే ఓడినందుకు పెద్దగా బాధ లేదు. ఇక మంచి ఆరంభం లభించాకా ఓడిపోవడం దురదృష్టకరం. ఈరోజు మా బ్యాటింగ్ లైనఫ్ సరిగ్గా కుదరలేదు.
తొలి వికెట్‌కు శుభారంభం ఇచ్చిన జైశ్వాల్, బట్లర్ స్వల్ప వ్యవదిలో ఔటవ్వడం.. నేను రనౌట్ అవ్వడం జట్టు లయను దెబ్బతీసింది. లక్నో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 155 పరుగుల టార్గెట్‌ను చేధించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ చివరి ఐదు ఓవర్లలో 50 పరుగులు చేయాల్సిన దశలో పిచ్ కఠినంగా మారిపోయింది.
మ్యాచ్ గెలిచామా.. ఓడామా అన్నది పక్కనబెడితే.. కొన్ని పాఠాలు మాత్రం నేర్చుకున్నాం. తర్వాతి మ్యాచ్‌ల్లో ఆ తప్పు జరగకుండా జాగ్రత్తపడుతాం. ఓడిపోయాం ఇంకేం చేయలేం.. తర్వాతి మ్యాచ్‌లో చూసుకోవాల్సిందే'' అంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment