సంజూ శాంసన్‌ భారీ సిక్సర్‌.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్‌ | Sanju Samson's gigantic strike lands on roof | Sakshi
Sakshi News home page

సంజూ శాంసన్‌ భారీ సిక్సర్‌.. బంతి ఎక్కడ పడిందో తెలుసా? వీడియో వైరల్‌

Published Tue, Jan 2 2024 7:52 AM | Last Updated on Tue, Jan 2 2024 8:45 AM

Sanju Samsons gigantic strike lands on roof - Sakshi

సంజూ శాంసన్‌(ఫైల్‌ ఫోటో)

టీమిండియా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌, కేరళ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ రంజీ ట్రోఫీ 2024 సీజన్‌ కోసం సిద్దమవుతున్నాడు. మొదటి రెండు మ్యాచ్‌లకు కేరళ జట్టు కెప్టెన్‌గా శాంసన్‌ వ్యవహరించనున్నాడు. ఈ సీజన్‌లో కేరళ తమ తొలి మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ జనవరి 5 నుంచి అలప్పుజా వేదికగా  ప్రారంభం కానుంది. ఈ క్రమంలో అలప్పుజాలో ఏర్పాటు చేసిన స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో సంజూ తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ప్రాక్టీస్‌లో భాగంగా శాంసన్‌ కొట్టిన ఓ సిక్స్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. కేరళ స్పిన్నర్‌ సిజోమన్ జోసెఫ్‌ బౌలింగ్‌ను సంజూ ప్రాక్టీస్‌ చేశాడు. ఈ క్రమంలో జోసెఫ్‌ మిడిల్‌ స్టంప్‌ లైన్‌లో బంతి వేయగా.. సంజూ భారీ సిక్సర్‌ బాదాడు. సంజూ కొట్టిన బంతి ఏకంగా స్టేడియం రూప్‌పైన పడింది.

ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్‌ రాయల్స్‌ ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా శాంసన్‌ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో సంజూ తొలి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. 114 బంతుల్లో 6 ఫోర్ల, 3 సిక్స్‌లతో 108 పరుగులు చేశాడు.
చదవండి: Big Bash League : ఆంక్షల ఫలితం... అఫ్గాన్‌ స్టార్‌ క్రికెటర్‌పై వేటు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement