రంజీ ట్రోఫీలో సర్వీసెస్ జట్టు సరి కొత్త చరిత్ర సృష్టించింది. 80 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించిన తొలి జట్టుగా సర్వీసెస్ రికార్డులకెక్కింది. రంజీ ట్రోఫీ 2023-2024లో భాగంగా హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం నమోదు చేసిన సర్వీసెస్.. ఈ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.
లో స్కోరింగ్ మ్యాచ్‌లో 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హర్యానా 144 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సర్వీసెస్.. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులకే ఆలౌటైంది. సర్వీసెస్ అర్జున్ శర్మ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సర్వీసెస్ జట్టులో ఎనిమిది బ్యాటర్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. అనంతరం హర్యానా కూడా దారుణ ప్రదర్శన కనబరిచింది. ఆ జట్టు 103 పరుగులకే ఆలౌట్ అయింది.
తొలి ఇన్నింగ్స్‌లో ఐదు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆడిన సర్వీసెస్ మరోసారి అదే ఆటతీరును కనబరిచింది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 140 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 5 పరుగుల ఆధిక్యాన్ని జోడించి 146 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు సర్వీసెస్ ఉంచింది. అయితే లక్ష్య ఛేదనలో హర్యానా 144 పరుగులకే కుప్పకూలింది.
రంజీ ట్రోఫీలో స్వల్ప తేడాతో విజయాలు..
1. ఒక్క పరుగు తేడాతో సర్వీసెస్ (హర్యానాపై) – 2024
2. రెండు పరుగుల తేడాతో జార్ఖండ్ (ఒడిషాపై) – 2018
3.నాలుగు పరుగుల తేడాతో బెంగాల్ (తమిళనాడుపై) – 2013
4. నాలుగు పరుగుల తేడాతో సౌరాష్ట్ర (ఢిల్లీపై)- 2016
5. ఐదు పరగుల తేడాతో విదర్భ (కర్నాటకపై) – 2017
Comments
Please login to add a commentAdd a comment