Shakib Al Hasan Enjoys Himself In Rain,Dives Over Wet Covers - Sakshi
Sakshi News home page

BAN Vs PAK: నీటిలో ఫీల్డింగ్‌ చేసిన షకీబ్‌ అల్‌ హసన్‌.. వీడియో వైరల్‌..

Published Mon, Dec 6 2021 9:37 AM | Last Updated on Mon, Dec 6 2021 3:08 PM

Shakib Al Hasan Enjoys Himself In Rain,Dives Over Wet Covers - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్, పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వరుణుడు అడ్డు తగులుతూనే ఉన్నాడు. వానతో రెండో రోజు కేవలం 6.2 ఓవర్ల ఆటే సాధ్యమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 161/2తో ఆదివారం ఆటను కొనసాగించిన పాకిస్తాన్‌ వర్షంతో ఆటను నిలిపి వేసే సమయానికి 63.2 ఓవర్లలో రెండు వికెట్లకు 188 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ అజహర్‌ అలీ (52 బ్యాటింగ్‌; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.

అతడికి తోడుగా కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (71 బ్యాటింగ్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నాడు. మూడు రోజుల ఆట మిగిలి ఉండగా... తొలి టెస్టులో నెగ్గిన పాకిస్తాన్‌ సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో ఉంది. ఆదివారం ఇక ఆట సాధ్యంకాదని అంపైర్లు ప్రకటించాక... మైదానంలో కప్పి ఉంచిన కవర్లపై ఉన్న నీటిలో బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ సరదాగా డైవ్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: IND Vs NZ: ఏంటి అశ్విన్‌.. బాహుబలిలో నీవు ఏమైనా ప్రభాస్‌ అనుకున్నావా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement