IPL 2021: హెట్‌మైర్‌ న్యూ హెయిర్‌ స్టైల్‌.. ఫ్యాన్స్‌ వినూత్న కామెంట్స్‌ | Shimron Hetmyer New Hairstyle Attracts Fans Hillarious Comments | Sakshi
Sakshi News home page

IPL 2021: హెట్‌మైర్‌ న్యూ హెయిర్‌ స్టైల్‌.. ఫ్యాన్స్‌ వినూత్న కామెంట్స్‌

Published Wed, Sep 22 2021 9:40 PM | Last Updated on Thu, Sep 23 2021 11:06 AM

Shimron Hetmyer New Hairstyle Attracts Fans Hillarious Comments - Sakshi

Courtesy: IPL.Com

Shimron Hetmyer New Hairstyle.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు షిమ్రోన్‌ హెట్‌మైర్‌ న్యూ హెయిర్‌ స్టైల్‌ లుక్‌లో అదరగొట్టాడు. అతని హెయిర్‌ స్టైల్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో కామెంట్‌ చేశారు. వాస్తవానికి హెట్‌మైర్‌ హెయిర్‌ స్టైల్‌లో కొత్తదనం ఏం లేదు. కేవలం అతని హెయిర్‌స్టైల్‌కు బ్లూ కలర్‌ రంగు వేశాడు. ఇదే కాస్త కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్‌ జెర్సీ కలర్‌.. బ్లూ.. హెట్‌మైర్‌ తన డ్రెస్‌, షూస్‌ మొత్తం బ్లూ కలర్‌ లో ఉంది. దీనిని చూసే ఫ్యాన్స్‌ కామెంట్‌ చేశారు. హెట్‌మైర్‌ ఈజ్‌ ఆల్‌ బ్లూ.. ముఖానికి కూడా బ్లూ కలర్‌ వేసుకుంటే  సూపర్‌ ఉంటుంది అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: IPL 2021 2nd Phase : పంజాబ్‌ ఆటగాడిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అనుమానం

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌  నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన ఎస్‌ఆర్‌హెచ్‌ ఆదిలోనే ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ విలియమ్సన్‌ మరో ఓపెనర్‌ వృద్దిమాన్‌ షాతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే రెండుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న విలియమ్సన్‌ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్‌ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  చివర్లో అబ్దుల్‌ సమద్‌ 28 పరుగులు.. రషీద్‌ ఖాన్‌ 22 పరుగులు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ 130 పరుగుల మార్క్‌ను దాటగలిగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో రబడ 3, అక్షర్‌ పటేల్‌, నోర్ట్జే చెరో రెండు వికెట్లు తీశారు.

చదవండి: Sanju Samson: దేవుడిచ్చిన టాలెంట్‌ను అనవసరంగా వేస్ట్‌ చేస్తున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement