
ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అయ్యర్‌కు తన వెన్నుగాయం మళ్లీ తిరగబెట్టింది. ఈ క్రమంలో అతడు నాలుగో రోజు మొత్తం ఫీల్డింగ్‌కు రాలేదు. ఐదో రోజు సైతం అయ్యర్ ఫీల్డ్‌లో కన్పించలేదు. ఈ ఫైనల్ మ్యాచ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అయ్యర్ 95 పరుగులతో రాణించాడు.
బ్యాటింగ్ చేసిన సమయంలో కూడా అయ్యర్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఫిజియో మైదానంలోకి వచ్చి రెండుసార్లు చికిత్స అందించాడు. కాగా గతేడాది వెన్ను గాయానికి అయ్యర్ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో గతేడాది ఐపీఎల్ కూడా దూరమయ్యాడు.
ఇప్పుడు సరిగ్గా మళ్లీ ఐపీఎల్ ఆరంభ సమయంలోనే అయ్యర్ గాయపడటం.. కేకేఆర్ ఫ్రాంచైజీని కలవరపెడుతోంది. ఒకవేళ అయ్యర్ దూరమైతే కేకేఆర్ కెప్టెన్‌గా నితీష్ రాణా మరోసారి బాధ్యతలు చేపట్టే ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది ఐపీఎల్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది.
చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. శ్రేయస్‌ను సెంట్రాల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించిన సంగతి తెలిసిందే. రంజీల్లో ఆడాలన్న తమ ఆదేశాలను అయ్యర్ ధిక్కరించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: IPL 2024: ఢిల్లీ జట్టులోకి ఫాస్టెస్ట్ సెంచరీ వీరుడు.. ఎవరంటే?