Shreyas Iyer Performs Magic Tricks With Mohammed Siraj After IND vs NZ 2021 Series - Sakshi

Shreyas Iyer- Mohammed Siraj: ఏమైనా మాట్లాడండి సర్‌.. ఆట పట్టించిన శ్రేయస్‌.. కార్డు పడేసి వెళ్లిపోయిన సిరాజ్‌!

Published Tue, Nov 23 2021 9:15 AM | Last Updated on Tue, Nov 23 2021 10:08 AM

Shreyas Iyer Performs Magic With Mohammed Siraj IND vs NZ 2021 Series - Sakshi

PC: BCCI

Shreyas Iyer Performs Magic Tricks With Mohammed Siraj After IND vs NZ 2021 Series: టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌తోనే కాదు.. తనదైన ప్రత్యేకమైన ‘మ్యాజిక్‌’ నైపుణ్యాలతోనూ ఆకట్టుకోగలడు. ఇప్పటికే డ్రెస్సింగ్‌రూంలోని ఎంతో మంది క్రికెటర్లు, సిబ్బందికి తన ‘స్కిల్స్‌’ చూపించిన శ్రేయస్‌.. ఈసారి పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను టార్గెట్‌ చేశాడు. తన ‘మాయ’తో సిరాజ్‌ చేతిలో ఉన్న కార్డును మార్చేశాడు. కాగా న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

నవంబరు 25 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు ఒక్కచోట సరదాగా గడుపుతున్న దృశ్యాలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. తన చేతిలో ఉన్న నాలుగు కార్డు(పేక ముక్కలు)ల్లో ఒకటిని తీసుకోవాల్సిందిగా శ్రేయస్‌... సిరాజ్‌ను కోరాడు. అతడు నాలుగు నంబర్‌ ఉన్న కార్డును తీసుకుని శ్రేయస్‌కు అందించాడు. ఈ క్రమంలో రాండమ్‌గా ఓ కార్డును తీసి.. సిరాజ్‌ చేతిలో పెట్టిన శ్రేయస్‌.. కాసేపటి తర్వాత చేతిని తెరవాల్సిందిగా సూచించాడు. 

అతడు చెప్పినట్లుగానే సిరాజ్‌ చేతిలో జోకర్‌ దర్శనమిచ్చింది. దీంతో అవాక్కవడం సిరాజ్‌ వంతైంది. వెంటనే కార్డును కిందపడేసి నవ్వుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఇక శ్రేయస్‌ మాత్రం మరింత జోష్‌గా.. ‘‘మియాన్‌ కుచ్‌ తో బోలో మియాన్‌... కుచ్‌ తో బోలో(మాట్లాడండి సర్‌.. ఏదైనా మాట్లాడండి)’’ అంటూ సరదాగా ఆటపట్టించాడు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ వీరిద్దరి సరదా ఫైట్‌ను చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

చదవండి: Rahul Dravid: నా ఫస్ట్‌లవ్‌ ద్రవిడ్‌.. తన కోసం మళ్లీ క్రికెట్‌ చూస్తా: నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement