టీమిండియా యవ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో గిల్ దుమ్మురేపాడు. తన హోం గ్రౌండ్‌లో శబమన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. 277 పరుగుల లక్ష్య ఛేదనలో రుత్‌రాజ్ గైక్వాడ్‌తో కలిసి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో చెలరేగిన గిల్ ఓ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో తొలి 30 ఇన్నింగ్స్‌లలో అత్యధిక ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించిన భారత ఓపెనర్‌గా గిల్ రికార్డులకెక్కాడు. గిల్ ఇప్పటివరకు 34 వన్డేలు ఆడగా.. అందులో 30 ఇన్నింగ్స్‌లలో ఓపెనర్‌గా బ్యాటింగ్ వచ్చాడు.
30 ఇన్నింగ్స్‌లలో గిల్ ఓపెనర్‌గా ఇప్పటివరకు 13 సార్లు ఫిప్టీ ప్లస్ స్కోర్లు సాధించాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆల్‌టైమ్ రికార్డును అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ ఓపెనర్‌గా 30 ఇన్నింగ్స్‌లలో 12 సార్లు ఏభై పైగా స్కోర్లు సాధించాడు. తాజా మ్యాచ్‌తో సచిన్ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో సచిన్ తర్వాత టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్(10సార్లు) ఉన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!
Gill has arrived at #IndiaCricketKaNayaGhar and his home ground! 🏟️♥️#TestedByTheBest #IDFCFirstBankODITrophy pic.twitter.com/PvjkuAPx5O
— JioCinema (@JioCinema) September 22, 2023
Comments
Please login to add a commentAdd a comment