సిరాజ్ (Photo: IPL/RCB)
IPL 2023- RCB- Siraj: ఐపీఎల్‌లో మరోసారి ఫిక్సింగ్ కలకలం సంచలనం రేపుతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్, హైదరాబాదీ స్టార్ మహ్మద్ సిరాజ్ ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ అజ్ఞాత వ్యక్తి సిరాజ్‌కు ఫోన్ చేసి ఆర్సీబీకి సంబంధించిన విషయాలు అడిగినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో సిరాజ్ గతవారం భారత క్రికెట్ నియంత్రణ మండలిని ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది. బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)తో తనకు వచ్చిన కాల్ గురించి సిరాజ్ వెల్లడించినట్లు పేర్కొంది. అయితే, సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదని, హైదరాబాద్‌కు చెందిన ఓ డ్రైవర్ అని, ఈ విషయంలో బీసీసీఐ వెంటనే చర్యలు చేపట్టినట్లు సదరు కథనం వెల్లడించింది.
అతడు బుకీ కాదు
ఈ మేరకు బీసీసీఐ సన్నిహిత వర్గాలు.. ‘‘సిరాజ్‌ను సంప్రదించింది బుకీ కాదు. బెట్టింగ్‌లకు అలవాటు పడిన ఓ హైదరాబాద్ డ్రైవర్ . బెట్టింగ్‌లో అతడు చాలా మేర డబ్బు పోగొట్టుకున్నాడు.ఈ క్రమంలో అతడు సిరాజ్‌ను సంప్రదించి ఆర్సీబీ అంతర్గత విషయాలు అడిగాడు.
ఈ విషయాన్ని వెంటనే సిరాజ్ బీసీసీఐ ఏసీయూకి తెలిపాడు. వెంటనే దర్యాప్తు సంస్థలు ఆ వ్యక్తిని పట్టుకున్నాయి’’ అని పేర్కొన్నట్లు పీటీఐ తెలిపింది. కాగా గతంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండీమాల్ ఫిక్సింగ్ ఉచ్చులో పడి కెరీర్‌ను నాశనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇదేం బుద్ధి
ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాయి. కాగా ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపే ఐపీఎల్ మ్యాచ్‌ల మీద తాజా సీజన్‌లో బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో సిరాజ్ ఫిర్యాదుతో బెట్టింగ్ రాయుడి వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో క్రికెట్ ప్రేమికులు.. ‘‘మ్యాచ్‌లు ఆస్వాదించాలి గానీ.. బెట్టింగ్‌లతో ఎందుకు అనసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు.
అంచెలంచెలుగా ఎదిగి
ఆ తర్వాత ఇదిలో ఇలా వేరేవాళ్లను కూడా ఇరికించాలని చూస్తారు’’ అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా సిరాజ్ పేద కుటుంబం నుంచి వచ్చి టీమిండియా స్టార్ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అతడి తండ్రి ఆటో నడిపేవారు. కొడుకు ఆకాంక్షలకు అనుగుణంగా అతడు క్రికెటర్ కావడంలో సహాయపడిన ఆయన.. సిరాజ్ కెరీర్ ఉన్నత శిఖరాలకు చేరేవేళ ఆ సంతోషాన్ని చూడకుండానే కన్నుమూశారు. ఇదిలా ఉంటే ఆర్సీబీ కీలక బౌలర్ అయిన సిరాజ్ ఐపీఎల్-2023లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లలో ఎనిమిది వికెట్లు తీశాడు.
చదవండి: 14 ఏళ్ల కిందట తండ్రికి ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకున్న అర్జున్ టెండూల్కర్
SRH Vs MI: మా జట్టులో తెవాటియా, మిల్లర్ లాంటి ఆటగాళ్లు ఉంటే బాగుండు!
Comments
Please login to add a commentAdd a comment