మహిళల క్రికెట్‌లో భాగంగా హంబన్‌తోట వేదికగా శ్రీలంకతో ఇవాళ (జూన్ 26) జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 15.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం మొదలు కావడంతో లంక ఇన్నింగ్స్‌ను అక్కడే ముగించారు.
లంక బ్యాటర్లలో విష్మి గౌతమ్ (24), చమారీ ఆటపట్టు (26), హర్షిత మాధవి (14), కవిష దిల్హరి (14 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. ఇమేష దులాని (6), హసిని పెరీరా (3 నాటౌట్) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. విండీస్ బౌలర్లలో అఫీ ఫ్లెచర్ నాలుగు వికెట్లతో చెలరేగింది.
వర్షం కారణంగా లంక ఇన్నింగ్స్ అర్దంతరంగా ముగియడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన విండీస్ విజయ లక్ష్యాన్ని 15 ఓవర్లలో 99 పరుగులుగా నిర్దారించారు. 99 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్ 14.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది.
మాథ్యూస్ (29), స్టెఫానీ టేలర్ (28 నాటౌట్), షెమెయిన్ క్యాంప్‌బెల్ (16), ఆలియా అలెన్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగా.. క్వియాన జోసఫ్ (6), చెడీన్ నేషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే ఔటయ్యారు. లంక బౌలర్లలో చమారీ ఆటపట్టు, కవిష దిల్హరి, సిచిని నిసంసలా తలో వికెట్ పడగొట్టారు. విండీస్ ఈ మ్యాచ్‌లో గెలవడంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. నిర్ణయాత్మకమైన మూడో టీ20 జూన్ 28న ఇదే వేదికగా జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment