ODI Series: స్వదేశంలో శ్రీలంకకు చుక్కెదురు.. విండీస్‌ చేతిలో పరాభవం | West Indies Women's Cricket Team Beat Sri Lanka By 6 Wickets In 3rd T20, Wins The Series | Sakshi
Sakshi News home page

ODI Series: స్వదేశంలో శ్రీలంకకు చుక్కెదురు.. విండీస్‌ చేతిలో పరాభవం

Published Sat, Jun 29 2024 10:20 AM | Last Updated on Sat, Jun 29 2024 10:27 AM

West Indies Women's Cricket Team Beat Sri Lanka By 6 Wickets In 3rd T20, Wins The Series

సొంత దేశంలో శ్రీలంక మహిళల క్రికెట్‌ జట్టుకు చుక్కెదురైంది. ద్వీప దేశం.. మరో ద్వీప దేశమైన వెస్టిండీస్‌ చేతిలో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వెస్టిండీస్‌.. 2-1 తేడాతో శ్రీలంకను ఓడించింది. హంబనతోట వేదికగా జరిగిన నిర్ణయాత్మకమైన మూడో టీ20 వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. చమారీ ఆటపట్టు (38), హర్షిత మాధవి (28), కవిష దిల్హరి (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్‌ బౌలర్లలో ఆలియా అలెన్‌, అఫీ ఫ్లెచర్‌ తలో 2 వికెట్లు.. చినెల్‌ హెన్రీ, రమ్హరాక్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 142 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్‌.. 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. హేలీ (49), క్యాంప్‌బెల్‌ (41 నాటౌట్‌), స్టెఫానీ టేలర్‌ (33) విండీస్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. లంక బౌలర్లలో కావ్య కవింది 2, సుగందిక కుమారి, కవిష దిల్హరి తలో వికెట్‌ పడగొట్టారు. 

కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ శ్రీలంక నెగ్గగా.. విండీస్‌ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ను శ్రీలంక 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లో కోసం వెస్టిండీస్‌ మహిళల క్రికెట్‌ జట్టు శ్రీలంకలో పర్యటించింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement