బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో ఆస్ట్రేలియా తొలి విజయం సాధించింది. ఇండోర్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. తద్వారా వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్-2023 ఫైనల్‌కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. కాగా ఆసీస్ రెగ్యూలర్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, రెండో టెస్టు ముగిసిన తర్వాత స్వదేశానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
తన తల్లి ఆరోగ్యం కుదటపడకపోవడంతో కమ్మిన్స్ అక్కడే ఉండిపోయాడు. దీంతో మూడో టెస్టుకు స్టీవ్ స్మిత్ సారథ్యం వహించాల్సి వచ్చింది. ఇండోర్ టెస్టులో స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్ తన వ్యహాలతో టీమిండియాను బోల్తా కొట్టించాడు. భారత టాపార్డర్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముగ్గురు స్పిన్నర్లతో బౌలింగ్ చేయించి ముప్పు తిప్పలు పెట్టాడు. ఇక మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ విలేకురల సమావేశంలో మాట్లాడాడు.
స్మిత్ మాట్లాడుతూ.. "మేము తొలుత బ్యాటింగ్ చేయాలని అనుకున్నాము. కానీ మేము టాస్ ఓడిపోవడంతో బౌలింగ్ చేయాల్సి వచ్చింది. తొలి రోజు మా బౌలర్లు ఎలా రాణిస్తారో అన్న ఆలోచన నాకు ఉండేది. కానీ మా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా కుహ్నేమన్ చాలా బాగా బౌలింగ్ చేశాడు. తొలి రోజు మేము భారత్‌పై పైయి సాధించాడనికి అదే కారణం. అదే విధంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖావాజా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు.
ఈ టెస్టులో మా బ్యాటర్లు కీలక భాగస్వామ్యాలు కూడా నెలకొల్పారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో మేము మరిన్ని పరుగులు చేయాలి అనుకున్నాం. కానీ భారత బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చారు. స్పిన్నర్లు చెలరేగడంతో మేము వెంట వెంటనే వికెట్లు కోల్పోయాం. అదే విధంగా సెకెండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియాను ఆలౌట్ చేయడానికి తీవ్రంగా శ్రమించాం. పుజ్జీ (పూజారా) అసాధారణ ఇన్నింగ్స్‌తో మమ్మల్ని చాలా ఇబ్బందిపెట్టాడు. అయినప్పటికీ మా బౌలర్లు అతడికి అడ్డుకట్ట వేశారు. లియాన్ కూడా చక్కటి ప్రదర్శన చేశాడు.
స్వదేశానికి వెళ్లిన ప్యాట్ కమ్మిన్స్ సలహాలు కూడా మాకు ఎంతో ఊపయోగపడ్డాయి. ఇక భారత్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం నాకు చాలా ఇష్టం. అదే విధంగా భారత పిచ్‌లపై టెస్టు క్రికెట్ ఆడటాన్ని ఎంతో గానో ఆస్వాదిస్తాను. ఇక్కడ గెలవడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అహ్మదాబాద్‌లో కూడా ఫలితాన్ని రిపీట్ చేసి సిరీస్ డ్రా చేయడానికి ప్రయత్నిస్తాం. అక్కడి పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి. ఇక చివరగా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది" అని పేర్కొన్నాడు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు స్కోర్లు:
ఇండియా- 109 & 163
ఆస్ట్రేలియా- 197 & 78/1
విజేత- ఆస్ట్రేలియా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నాథన్ లియోన్(11 వికెట్లు)
చదవండి: WTC Final 2023: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కి ఆస్ట్రేలియా.. అదే జరిగితే టీమిండియాకు కష్టమే!? అయితే..
Comments
Please login to add a commentAdd a comment