
టీ20 వరల్డ్‌కప్-2024లో న్యూజిలాండ్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని విభాగాల్లో విఫలమైన కివీస్.. అఫ్గాన్ ముందు మోకరిల్లింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గుర్భాజ్(56 బంతుల్లో 80, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్(44) అదరగొట్టారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్, మాట్ హెన్రి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్ ఒక్క వికెట్ సాధించారు.
చెలరేగిన ఫారూఖీ, రషీద్..
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అఫ్గానిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపించారు. అఫ్గాన్ బౌలర్ల దాటికి న్యూజిలాండ్ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్ పేసర్ ఫజల్హక్ ఫారూఖీ, కెప్టెన్ రషీద్ ఖాన్ తలా నాలుగు వికెట్లు పడగొట్టి బ్లాక్ క్యాప్స్ పతనాన్ని శాసించారు.
వీరితో మహ్మద్ నబీ రెండు వికెట్లు సాధించాడు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18), మాట్ హెన్రీ(12) డబుల్ డిజిట్ స్కోర్ చేయగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment