Babar Azam breaks Virat Kohli's record Aakash Chopra Comments: పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయి అందుకున్న సారథిగా అవతరించాడు. తద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును అధిగమించాడు. టీ20 ప్రపంచకప్-2021 టోర్నీలో భాగంగా అఫ్గనిస్తాన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదు చేశాడు.
అప్పుడు కూడా అంతే..
కాగా విరాట్ కోహ్లి 30 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా... బాబర్ ఆజమ్ 26 ఇన్నింగ్స్‌లోనే అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇక ఆజమ్(26), కోహ్లి(30) తర్వాత డుప్లెసిస్(31), ఆరోన్ ఫించ్(32), కేన్ విలియమ్సన్(36) టాప్-5లో చోటు దక్కించుకున్నారు. ఇక గతంలో అంతర్జాతీయ టీ20లలో 56 ఇన్నింగ్స్‌లో 2000 పరుగులు పూర్తి చేసుకున్న మొదటి బ్యాటర్‌గా ఉన్న కోహ్లి రికార్డును సైతం బాబర్ ఆజమ్ బ్రేక్ చేశాడు. 52 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లి ఏ రికార్డు సృష్టించినా.. దానిని అధిగమించడం బాబర్ ఆజమ్‌కు అలవాటుగా మారిందన్నాడు. రికార్డుల వేటలో ఆజమ్... కోహ్లి వెనకాలే పరుగులు పెడుతున్నాడని ప్రశంసించాడు.
అత్యద్భుత ప్రదర్శనతో కోహ్లిని ఛేజ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. కాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ 47 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
చదవండి: T20 World Cup 2021 Final: ఆ పేరు గుర్తుపెట్టుకోండి.. ఫైనల్‌లో ఆ రెండు జట్లే: స్టోక్స్
Comments
Please login to add a commentAdd a comment